Amduge lomgem gaaga aligidinaa nenu

అందుకే లోఁగేఁ గాక అలిగితినా నేను
Language

(॥పల్లవి॥)
అందుకే లోఁగేఁ గాక అలిగితినా నేను
అందముగా నీమాట లడుగరే విభుని

(॥అందుకే॥)
కోమలపు మేనివాఁడు కొండలవంటిచన్నుల
నేమని వొత్తుదునే న న్నేల పట్టీనే
దీమసపుతోడితాను దేవరవంటివాఁడు
యీమేరఁ దనమోవియెంగి లేమి సేతునే

(॥అందుకే॥)
పూని నల్లఁ గలు వలపోగువంటి తనమీఁద
యేనిగెనడపుపాదా లెట్టు వేతునే
పానఁబట్టినచూపుల జగములేలేటివాని
కొనలుకొనలుగాఁగఁగుచ్చి యె ట్టెత్తుదునే

(॥అందుకే॥)
శ్రీవేంకటేశ్వరుని చిగురు నా చేతులు
కావరించి నే నెట్టు కౌఁగిలింతునే
ఆవటించి తానే కూడినటువంటి చెమట
వావిరి తనపై నెట్టు వడియింతునే

(||pallavi||)
aṁduge lom̐gem̐ gāga aligidinā nenu
aṁdamugā nīmāḍa laḍugare vibhuni

(||aṁduge||)
komalabu menivām̐ḍu kŏṁḍalavaṁṭisannula
nemani vŏttudune na nnela paṭṭīne
dīmasabudoḍidānu devaravaṁṭivām̐ḍu
yīmeram̐ danamoviyĕṁgi lemi sedune

(||aṁduge||)
pūni nallam̐ galu valaboguvaṁṭi tanamīm̐da
yenigĕnaḍabubādā lĕṭṭu vedune
pānam̐baṭṭinasūbula jagamuleleḍivāni
kŏnalugŏnalugām̐gam̐guchchi yĕ ṭṭĕttudune

(||aṁduge||)
śhrīveṁkaḍeśhvaruni siguru nā sedulu
kāvariṁchi ne nĕṭṭu kaum̐giliṁtune
āvaḍiṁchi tāne kūḍinaḍuvaṁṭi sĕmaḍa
vāviri tanabai nĕṭṭu vaḍiyiṁtune