అందుకే దయవుట్టు నాతనికిని
(॥పల్లవి॥)
అందుకే దయవుట్టు నాతనికిని
యెందును వనితలకు ఇచ్చకమే మేలు
(॥అందు॥)
గఁటమున రమణుని గడవనాడుటకంటె
మాఁట మాఁటగాఁ బొగడే మచ్చికే మేలు
సాటిబేటికి బొమ్మల జింకించుటకంటే
సూటిగా మోము దప్పక చూచుటే మేలు
(॥అందు॥)
మోనముతోడ ముగము మునుచుకవుండుకంటే
నానఁబెట్టి సెలవుల నవ్వుటే మేలు
ఆనవెట్టుక వెనఁగి అదలించుటకంటే
కానుకిచ్చి వూరకుండే ఘనతే మేలు
(॥అందు॥)
చేరువనుండి లోలోనే సిగ్గులు వడుటకంటే
కూరిమితేఁ గాఁగిలించుకొనుటే మేలు
గారవించి నిన్ను శ్రీవేంకటేశుఁడు మెచ్చి యేలె
నేరుపుగలదానవు నీకు నిదే మేలు
(||pallavi||)
aṁduge dayavuṭṭu nādanigini
yĕṁdunu vanidalagu ichchagame melu
(||aṁdu||)
gam̐ṭamuna ramaṇuni gaḍavanāḍuḍagaṁṭĕ
mām̐ṭa mām̐ṭagām̐ bŏgaḍe machchige melu
sāḍibeḍigi bŏmmala jiṁkiṁchuḍagaṁṭe
sūḍigā momu dappaga sūsuḍe melu
(||aṁdu||)
monamudoḍa mugamu munusugavuṁḍugaṁṭe
nānam̐bĕṭṭi sĕlavula navvuḍe melu
ānavĕṭṭuga vĕnam̐gi adaliṁchuḍagaṁṭe
kānugichchi vūraguṁḍe ghanade melu
(||aṁdu||)
seruvanuṁḍi lolone siggulu vaḍuḍagaṁṭe
kūrimidem̐ gām̐giliṁchugŏnuḍe melu
gāraviṁchi ninnu śhrīveṁkaḍeśhum̐ḍu mĕchchi yelĕ
nerubugaladānavu nīgu nide melu