అందుకనేఁ గాక నేను అడుగుకో నోపనా
(॥పల్లవి॥)
అందుకనేఁ గాక నేను అడుగుకో నోపనా
యెందరికైనాఁ దాను ఇచ్చకములాడునే
(॥॥)
ఆవేళ కక్కూర్తిమాట లాడుఁగాని వేరొకతె
కైవశము సేసుకొంటే గానిమ్మనునే
చేవట్టి నేఁదీసితే చిత్తగించి వచ్చీఁ గాని
వావి యెవ్వతె చెప్పినా వలపులు చల్లునే
(॥॥)
వొద్దనున్న అంతవడి వొడఁబడి వుండుఁగాని
బుద్దియెవ్వతె చెప్పినా నపుడే వినునే
తిద్దుకొని బాసగొంటే దిష్టముగా నిచ్చుఁగాని
బద్దు లెవ్వతాడించినాఁ బలుమారు నాడునే
(॥॥)
సరసములాడితేను చనవిచ్చుఁ గాని వేరే
తరుణి కాఁగిలించితే దక్కివుండునే
యిరవై శ్రీవేంకటేశుఁడిటు తానే నన్ను గూఁడె
యెరవుల వారినెల్లా నెనసీ నెనయఁడే
(||pallavi||)
aṁduganem̐ gāga nenu aḍugugo nobanā
yĕṁdarigainām̐ dānu ichchagamulāḍune
(||||)
āveḽa kakkūrdimāḍa lāḍum̐gāni verŏgadĕ
kaivaśhamu sesugŏṁṭe gānimmanune
sevaṭṭi nem̐dīside sittagiṁchi vachchīm̐ gāni
vāvi yĕvvadĕ sĕppinā valabulu sallune
(||||)
vŏddanunna aṁtavaḍi vŏḍam̐baḍi vuṁḍum̐gāni
buddiyĕvvadĕ sĕppinā nabuḍe vinune
tiddugŏni bāsagŏṁṭe diṣhṭamugā nichchum̐gāni
baddu lĕvvadāḍiṁchinām̐ balumāru nāḍune
(||||)
sarasamulāḍidenu sanavichchum̐ gāni vere
taruṇi kām̐giliṁchide dakkivuṁḍune
yiravai śhrīveṁkaḍeśhum̐ḍiḍu tāne nannu gūm̐ḍĕ
yĕravula vārinĕllā nĕnasī nĕnayam̐ḍe