అందుకందుకును సరి ఆతఁడే జాణ
(॥పల్లవి॥)
అందుకందుకును సరి ఆతఁడే జాణ
మందెమేళమున నిన్ను మన్నించెఁ గదవే
(॥అందు॥)
మంచము పై నీవుండి మచ్చిక నాతఁడు రాఁగా
ఇంచుకంతఇన లేవ విది యేఁటిదే
పంచ నాతఁడు దిగువ పరపు పైఁగూచుండి
వంచుకొని నిన్నుఁ దనవద్దికిఁ దీసెఁగదే
(॥అందు॥)
వుద్దాలు మెట్టుకొని వొద్దికి నాతఁడు రాఁగా
వుద్దండాన నవి కడకూరుచవేమే
చద్దికి వేఁడికి నిన్ను జలకేళికిఁ దీసి
గద్దించి అంతలో నిన్ను గాఁగిలించెగదవే
(॥అందు॥)
వోరవాకిలి సేసె వొంటి నీవు లోన నుండి
రారమ్మన్నా నెదురుగా రావు గదవే
యీ రీతి శ్రీ వేంకటేశుఁ డిట్టె నిన్ను నేఁడు గూడె
తారుకాణ రతులెల్ల తలఁపించెఁగదవే
(||pallavi||)
aṁdugaṁdugunu sari ādam̐ḍe jāṇa
maṁdĕmeḽamuna ninnu manniṁchĕm̐ gadave
(||aṁdu||)
maṁchamu pai nīvuṁḍi machchiga nādam̐ḍu rām̐gā
iṁchugaṁta̮ina leva vidi yem̐ṭide
paṁcha nādam̐ḍu diguva parabu paim̐gūsuṁḍi
vaṁchugŏni ninnum̐ danavaddigim̐ dīsĕm̐gade
(||aṁdu||)
vuddālu mĕṭṭugŏni vŏddigi nādam̐ḍu rām̐gā
vuddaṁḍāna navi kaḍagūrusaveme
saddigi vem̐ḍigi ninnu jalageḽigim̐ dīsi
gaddiṁchi aṁtalo ninnu gām̐giliṁchĕgadave
(||aṁdu||)
voravāgili sesĕ vŏṁṭi nīvu lona nuṁḍi
rārammannā nĕdurugā rāvu gadave
yī rīdi śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭĕ ninnu nem̐ḍu gūḍĕ
tārugāṇa radulĕlla talam̐piṁchĕm̐gadave