అందుకల్లా లోనుగాన అట్టే యెచ్చరికెతోడ
(॥పల్లవి॥)
అందుకల్లా లోనుగాన అట్టే యెచ్చరికెతోడ
పొందుగా హరిఁ దలఁచే పురుషుడే ఘనుఁడు
(॥అందు॥)
చలములు పుట్టించ సారె మచ్చరము రేఁచ
కలుగు నానావిధ కారణములు
తలఁపులు భ్రమయించ తగువేడ్క లొనరించ
పలుమా రెదుట నిల్చు బహురూపాలు
(॥అందు॥)
తగవులు దిద్దించ తగ నలమటఁ బెట్ట
తగులు ననేకబంధములెల్లాను
పగ సాధింపించ నప్పటి నుపాయాలు నేర్ప
నిగిడివచ్చు ననేకనెపములెల్లాను
(॥అందు॥)
తేరకే మేనలయించ దేశమెల్లా నావటించ
వూరకే తోఁచు ననేకవుద్యోగాలు
కోరి శ్రీవేంకటేశ్వరుఁ గొలిచి నిశ్చింతుఁ డైతే
ఆరయ మతిలో నిండు నానందాలు
(||pallavi||)
aṁdugallā lonugāna aṭṭe yĕchcharigĕdoḍa
pŏṁdugā harim̐ dalam̐se puruṣhuḍe ghanum̐ḍu
(||aṁdu||)
salamulu puṭṭiṁcha sārĕ machcharamu rem̐sa
kalugu nānāvidha kāraṇamulu
talam̐pulu bhramayiṁcha taguveḍka lŏnariṁcha
palumā rĕduḍa nilsu bahurūbālu
(||aṁdu||)
tagavulu diddiṁcha taga nalamaḍam̐ bĕṭṭa
tagulu nanegabaṁdhamulĕllānu
paga sādhiṁpiṁcha nappaḍi nubāyālu nerba
nigiḍivachchu naneganĕbamulĕllānu
(||aṁdu||)
terage menalayiṁcha deśhamĕllā nāvaḍiṁcha
vūrage tom̐su nanegavudyogālu
kori śhrīveṁkaḍeśhvarum̐ gŏlisi niśhchiṁtum̐ ḍaide
āraya madilo niṁḍu nānaṁdālu