Amdugade taarugaana amte saalunem

అందుకదే తారుకాణ అంతే చాలునేఁ
Language

(॥పల్లవి॥)
అందుకదే తారుకాణ అంతే చాలునేఁ
జెంది నిన్ను దూరఁ జుమ్మీ చెప్పితిఁ గాని

(॥అందు॥)
వింటిఁజుమ్మీ నీనటన వింతసుద్దులు నిన్ను-
నంటిముట్టి యిఁకనేమి ననఁగాని
కంటిఁజుమ్మీ నీమేన గబ్బిచేఁతలు నే-
నొంటి నీకు బుద్దిచెప్పనొల్లఁ గాని

(॥అందు॥)
హెచ్చెఁజుమ్మీ నీవేసా లిందరిలోన అంత
విచ్చి విచ్చి యిటు వెళ్లవేయఁగాని
వచ్చెఁజుమ్మీ నీబాస నీవద్ది కప్పుడే నే
రచ్చనీదొలతనాలు రాఁపుసేయఁగాని

(॥అందు॥)
చిక్కెఁ జుమ్మీ నీకాఁగిలి చేతికిఁజేయి వేరే
తక్కినసుద్దులు మరి తడవఁగాని
దక్కెఁజుమ్మీ నీమన్నన తప్పక నాకు నేఁ
జక్కని శ్రీవేంకటేశ చాలించఁగాని

(||pallavi||)
aṁdugade tārugāṇa aṁte sālunem̐
jĕṁdi ninnu dūram̐ jummī sĕppidim̐ gāni

(||aṁdu||)
viṁṭim̐jummī nīnaḍana viṁtasuddulu ninnu-
naṁṭimuṭṭi yim̐kanemi nanam̐gāni
kaṁṭim̐jummī nīmena gabbisem̐talu ne-
nŏṁṭi nīgu buddisĕppanŏllam̐ gāni

(||aṁdu||)
hĕchchĕm̐jummī nīvesā liṁdarilona aṁta
vichchi vichchi yiḍu vĕḽlaveyam̐gāni
vachchĕm̐jummī nībāsa nīvaddi kappuḍe ne
rachchanīdŏladanālu rām̐puseyam̐gāni

(||aṁdu||)
sikkĕm̐ jummī nīgām̐gili sedigim̐jeyi vere
takkinasuddulu mari taḍavam̐gāni
dakkĕm̐jummī nīmannana tappaga nāgu nem̐
jakkani śhrīveṁkaḍeśha sāliṁcham̐gāni