Amdu kemta gadimcheve aadanimeemda

అందు కెంత గడించేవే ఆతనిమీఁద
Language

(॥పల్లవి॥)
అందు కెంత గడించేవే ఆతనిమీఁద
పందెము వేయఁగా చేయి పట్టెఁగాక

(॥అందు॥)
ఘనుఁ డాతఁ డేమైనా కాముకుఁడా చెలితోను
ననుపున నూరకే నవ్వెఁగాక
అనిశ మందరువంటి ఆరజపువాఁడా
చెనకి పెనఁగఁగాను చేతనంటెఁ గాక

(॥అందు॥)
యిన్నిటా సరసుఁ డీతఁ డెమ్మెకాఁడా, ఆవనిత
చన్నులు మోపఁగా సరసమాడెఁగాక
సన్నల నందరిమీఁదాఁ జల్లే జాజర కాఁడా
కన్నెవు పంతమాడఁగాఁ గప్రాన వేసెఁగాక

(॥అందు॥)
రసికుఁడాతఁడు కాతరపువాఁడా మానినులు
కొసరి పైకొనఁగాను కూడెఁగాక
యెగ శ్రీవేంకటేశుఁ డితఁడె మాయేలిక
సుసరాన నిన్ను నేవె సుగుణ గాక

(||pallavi||)
aṁdu kĕṁta gaḍiṁcheve ādanimīm̐da
paṁdĕmu veyam̐gā seyi paṭṭĕm̐gāga

(||aṁdu||)
ghanum̐ ḍādam̐ ḍemainā kāmugum̐ḍā sĕlidonu
nanubuna nūrage navvĕm̐gāga
aniśha maṁdaruvaṁṭi ārajabuvām̐ḍā
sĕnagi pĕnam̐gam̐gānu sedanaṁṭĕm̐ gāga

(||aṁdu||)
yinniḍā sarasum̐ ḍīdam̐ ḍĕmmĕgām̐ḍā, āvanida
sannulu mobam̐gā sarasamāḍĕm̐gāga
sannala naṁdarimīm̐dām̐ jalle jājara kām̐ḍā
kannĕvu paṁtamāḍam̐gām̐ gaprāna vesĕm̐gāga

(||aṁdu||)
rasigum̐ḍādam̐ḍu kādarabuvām̐ḍā māninulu
kŏsari paigŏnam̐gānu kūḍĕm̐gāga
yĕga śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍĕ māyeliga
susarāna ninnu nevĕ suguṇa gāga