అందు కేమి నిను నింక నననయ్యా
(॥పల్లవి॥)
అందు కేమి నిను నింక నననయ్యా
కిందటివలె నే కోపగించనయ్యా
(॥అందు॥)
సన్నలు సేసితివి సమ్మతించి నవ్వితివి
కన్నులతుదలనే కదవయ్యా
నన్ను నేల మొరఁగేవు నా కేల వెరచేవు
పన్ని యాపె పిలిచీని పదవయ్యా
(॥అందు॥)
చెక్కులు నొక్కితివి చేతుల మొక్కితివి
యెక్కడిసుద్దులు నింక నేలయ్యా
యిక్కడ నీయాన లేల యెవ్వరు వినేరు నేఁడు
అక్కడనే యేమన్నా ననవయ్యా
(॥అందు॥)
అందగాఁడ వైతివి ఆపెనే కూడితివి
చెందిన శ్రీవేంకటేశ చెల్లునయ్యా
అందరికంటె నెక్కుడు అలమేలుమంగ నేను
కందున నన్ను గూడితి కానీవయ్యా
(||pallavi||)
aṁdu kemi ninu niṁka nananayyā
kiṁdaḍivalĕ ne kobagiṁchanayyā
(||aṁdu||)
sannalu sesidivi sammadiṁchi navvidivi
kannuladudalane kadavayyā
nannu nela mŏram̐gevu nā kela vĕrasevu
panni yābĕ pilisīni padavayyā
(||aṁdu||)
sĕkkulu nŏkkidivi sedula mŏkkidivi
yĕkkaḍisuddulu niṁka nelayyā
yikkaḍa nīyāna lela yĕvvaru vineru nem̐ḍu
akkaḍane yemannā nanavayyā
(||aṁdu||)
aṁdagām̐ḍa vaidivi ābĕne kūḍidivi
sĕṁdina śhrīveṁkaḍeśha sĕllunayyā
aṁdarigaṁṭĕ nĕkkuḍu alamelumaṁga nenu
kaṁduna nannu gūḍidi kānīvayyā