అందు కేమి నీవు మాతో నన వలెనా
(॥పల్లవి॥)
అందు కేమి నీవు మాతో నన వలెనా
చందముగ నొడఁబరచఁగ నింత వలెనా
(॥అందు॥)
ఈ యడకు రా కుండితే యేడనుండైనా నీకు
చే యెత్తి మొక్కిన దొక సెలవే కాదా
పాయ మెంత వెంచినాను ప్రాణము నీ కొప్పగించి
కాయముతో బదికేది ఘనత నీదే కాదా
(॥అందు॥)
కన్నులఁ జూడ కుండినా కడ నీ వార మని
వున్నట్టే వుండుట నీకే వొప్పు గాదా
మన్ననలు దవ్వైనా మనసు నీపైఁ బెట్టి
యిన్నిటా నుండుట నీకు నిది గీర్తి గాదా
(॥అందు॥)
మునుపఁ జెప్పంపకున్నా మొక్కలాన నిట్టే వచ్చి
చనవు చేకొనుటే చాలదా మాకు
యెన లేక శ్రీవెంకటేశ నన్నుఁ గూడితివి
ననిచితి నిది మీకు నయమే కాదా
(||pallavi||)
aṁdu kemi nīvu mādo nana valĕnā
saṁdamuga nŏḍam̐barasam̐ga niṁta valĕnā
(||aṁdu||)
ī yaḍagu rā kuṁḍide yeḍanuṁḍainā nīgu
se yĕtti mŏkkina dŏga sĕlave kādā
pāya mĕṁta vĕṁchinānu prāṇamu nī kŏppagiṁchi
kāyamudo badigedi ghanada nīde kādā
(||aṁdu||)
kannulam̐ jūḍa kuṁḍinā kaḍa nī vāra mani
vunnaṭṭe vuṁḍuḍa nīge vŏppu gādā
mannanalu davvainā manasu nībaim̐ bĕṭṭi
yinniḍā nuṁḍuḍa nīgu nidi gīrdi gādā
(||aṁdu||)
munubam̐ jĕppaṁpagunnā mŏkkalāna niṭṭe vachchi
sanavu segŏnuḍe sāladā māgu
yĕna lega śhrīvĕṁkaḍeśha nannum̐ gūḍidivi
nanisidi nidi mīgu nayame kādā