Amdu kemi dosamu amtavaamda vauduvayya

అందు కేమి దోసము అంతవాఁడ వౌదువయ్య
Language

(॥పల్లవి॥)
అందు కేమి దోసము అంతవాఁడ వౌదువయ్య
గందము పూసినయట్టి కపురా(?) యిది

(॥అప॥)
అప్పుడే నాతో మాటలాడి యాపెతో నాడేవు
కప్పురముదిన్ననోరి కపురా యిది
యిప్పటి నీ మేనిరేక లిటు నటు చాఁచేవు
తప్పనిరచ్చల దొరతనమా యిది

(॥అప॥)
చాయల సన్నల రెంటా సరిఁదూఁగఁ దిరిగేవు
పాయపు మదముతోడి వంతమా యిది
చేయి చాఁచి వొండొరుల చేతులకు మొక్కించేవు
నీయంకెకు వంచుకొనే నేరుపా యిది

(॥అప॥)
గక్కున నిద్దరి నిట్టె కౌఁగిలించుకొంటి విదె
పక్కునఁ బాలుదాగిన బలిమా యిది
మక్కువ శ్రీవేంకటేశ మమ్ము మెచ్చే వప్పటిని
మొక్కలపు రతులలో మోహమా యిది

(||pallavi||)
aṁdu kemi dosamu aṁtavām̐ḍa vauduvayya
gaṁdamu pūsinayaṭṭi kaburā(?) yidi

(||aba||)
appuḍe nādo māḍalāḍi yābĕdo nāḍevu
kappuramudinnanori kaburā yidi
yippaḍi nī menirega liḍu naḍu sām̐sevu
tappanirachchala dŏradanamā yidi

(||aba||)
sāyala sannala rĕṁṭā sarim̐dūm̐gam̐ dirigevu
pāyabu madamudoḍi vaṁtamā yidi
seyi sām̐si vŏṁḍŏrula sedulagu mŏkkiṁchevu
nīyaṁkĕgu vaṁchugŏne nerubā yidi

(||aba||)
gakkuna niddari niṭṭĕ kaum̐giliṁchugŏṁṭi vidĕ
pakkunam̐ bāludāgina balimā yidi
makkuva śhrīveṁkaḍeśha mammu mĕchche vappaḍini
mŏkkalabu radulalo mohamā yidi