అందు కేమయ్యా నే నడ్డమాడేనా
(॥పల్లవి॥)
అందు కేమయ్యా నే నడ్డమాడేనా
చంది వద్దనేనా చెనకేవు రతికి
(॥అందు॥)
పగటున నన్నునేల పైకొని వేఁడుకొనేవు
నగుత యెఱుఁగనా నాతో నీవు
జగడాలదాననా చనవరీకాంతను
తగవు నే నెఱఁగనా నాతో నీవు
(॥అందు॥)
చెలిమిసేసి నన్ను చెక్కునొక్కే వప్పటిని
వలచు టెఱఁగనా వడి నా(నీ?)కును
చలము సాదించేనా సలిగె గలదానను
తలఁపు నే నెఱఁగనా దగ్గరేవు రతికి
(॥అందు॥)
కన్నుసన్నలనే చూచి కాఁగిటఁ బెనఁగే విదె
మన్నించే దెఱఁగనా మంతనానను
అన్నిటా శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
పన్ని కూడే దెఱఁగనా పదరేవు రతికి
(||pallavi||)
aṁdu kemayyā ne naḍḍamāḍenā
saṁdi vaddanenā sĕnagevu radigi
(||aṁdu||)
pagaḍuna nannunela paigŏni vem̐ḍugŏnevu
naguda yĕṟum̐ganā nādo nīvu
jagaḍāladānanā sanavarīgāṁtanu
tagavu ne nĕṟam̐ganā nādo nīvu
(||aṁdu||)
sĕlimisesi nannu sĕkkunŏkke vappaḍini
valasu ṭĕṟam̐ganā vaḍi nā(nī?)kunu
salamu sādiṁchenā saligĕ galadānanu
talam̐pu ne nĕṟam̐ganā daggarevu radigi
(||aṁdu||)
kannusannalane sūsi kām̐giḍam̐ bĕnam̐ge vidĕ
manniṁche dĕṟam̐ganā maṁtanānanu
anniḍā śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
panni kūḍe dĕṟam̐ganā padarevu radigi