అందితిఁ బొందితి నల్లనాఁడే తన
(॥పల్లవి॥)
అందితిఁ బొందితి నల్లనాఁడే తన-
కందువ లింకాఁ గడమా నేఁడు
(॥అంది॥)
వలవనిజోలిఁక వద్దనవే తన-
తలఁపులోన నుందాన నిదే
బలిమి సేయ నిఁకఁ బనిలేదు తాఁ
గలఁడు నేరి గలను కడమా యిపుడు
(॥అంది॥)
వూరకె మాఁటలు వొద్దనవే తమ-
వారము గామా వలసినను
సారెకుఁ బెనఁగఁగఁ జవిగాదు
కారణము గలదు కడమా యిఁకను
(॥అంది॥)
తగవు లేమిటికిఁ దగదనవే తా
నగినప్పుడే నే ననిచితిని
పగటు శ్రీ వేంకటపతి ననుఁ గూడెను మై
గగురుపొడిచె నిఁకఁ గడమా యిపుడు
(||pallavi||)
aṁdidim̐ bŏṁdidi nallanām̐ḍe tana-
kaṁduva liṁkām̐ gaḍamā nem̐ḍu
(||aṁdi||)
valavanijolim̐ka vaddanave tana-
talam̐pulona nuṁdāna nide
balimi seya nim̐kam̐ baniledu tām̐
galam̐ḍu neri galanu kaḍamā yibuḍu
(||aṁdi||)
vūragĕ mām̐ṭalu vŏddanave tama-
vāramu gāmā valasinanu
sārĕgum̐ bĕnam̐gam̐gam̐ javigādu
kāraṇamu galadu kaḍamā yim̐kanu
(||aṁdi||)
tagavu lemiḍigim̐ dagadanave tā
naginappuḍe ne nanisidini
pagaḍu śhrī veṁkaḍabadi nanum̐ gūḍĕnu mai
gagurubŏḍisĕ nim̐kam̐ gaḍamā yibuḍu