Amdi teliyamgaraadaa amgana nerubulellaa

అంది తెలియఁగరాదా అంగన నేరుపులెల్లా
Language

(॥పల్లవి॥)
అంది తెలియఁగరాదా అంగన నేరుపులెల్లా
కందువ తారుకాణలు గలిగె మీకిప్పుడు

(॥॥)
నిద్దపు నొసలిమీఁద నిలువుఁగస్తూరిబొట్టు
అద్దము చూచి గోర నటుదిద్దఁగా
వొద్దిక వెనకవంకననుండిననీనీడ గని
ముద్దుచూపి సన్న సేసీ మొరఁగులేలయ్యా

(॥॥)
గుబ్బలపై మాణికాలఁ గుచ్చినహరములు
అబ్బురానఁ దలవంచి యమరించఁగా
నిబ్బరాన నీవెదుట నిలిచితే నీనీడ
గబ్బితనమునఁ గని గాఁగిలించె నదివో

(॥॥)
మించుబంగారుపావాలు మెట్టఁగ శ్రీవేంకటేశ
చంచుల నీవును దనసరి నుండఁగా
నించి గోరిమెఱుఁగులో నీరూపు వొడగని
అంచెల నిన్నుఁ గలసినది మెచ్చరాదా

(||pallavi||)
aṁdi tĕliyam̐garādā aṁgana nerubulĕllā
kaṁduva tārugāṇalu galigĕ mīgippuḍu

(||||)
niddabu nŏsalimīm̐da niluvum̐gastūribŏṭṭu
addamu sūsi gora naḍudiddam̐gā
vŏddiga vĕnagavaṁkananuṁḍinanīnīḍa gani
muddusūbi sanna sesī mŏram̐gulelayyā

(||||)
gubbalabai māṇigālam̐ guchchinaharamulu
abburānam̐ dalavaṁchi yamariṁcham̐gā
nibbarāna nīvĕduḍa niliside nīnīḍa
gabbidanamunam̐ gani gām̐giliṁchĕ nadivo

(||||)
miṁchubaṁgārubāvālu mĕṭṭam̐ga śhrīveṁkaḍeśha
saṁchula nīvunu danasari nuṁḍam̐gā
niṁchi gorimĕṟum̐gulo nīrūbu vŏḍagani
aṁchĕla ninnum̐ galasinadi mĕchcharādā