Amdi idavu seside naayamgaa pani | naa

అంది ఇతవు సేసితే నాయఁగా పని । నా
Language

(॥పల్లవి॥)
అంది ఇతవు సేసితే నాయఁగా పని । నా-
కందరితో వెరగయ్యీ నాయఁగా పని

(॥అంది॥)
చిందేటిచెక్కుచెమట చేతఁదుడువఁగఁబోతే
అందుకేఁ తా జగడించీ నాయఁగా పని
కందువలఁ దనమేన గందము వూయఁగబోతే
అందందే తప్పకచూచె నాయఁగా పని

(॥అంది॥)
తురుమువాడుఁబువ్వులు తొలఁగఁ దియ్యఁగఁబోతే
అరమరై జంకించీ నాయఁగా పని
గరిమ వంచినమోము కని అలసితివంటే
అరుదుగా మారుమోమై ఆయఁగా పని

(॥అంది॥)
అప్పుడు చెదరినట్టిహారాలు చక్కదొబ్బితే-
నప్పటి తాఁ గాఁగిలించీ నాయఁగా పని
కప్పురము మోవి కియ్యఁగా శ్రీవేంకటపతి
అప్పళించె రతుల న న్నాయఁగా పని

(||pallavi||)
aṁdi idavu seside nāyam̐gā pani | nā-
kaṁdarido vĕragayyī nāyam̐gā pani

(||aṁdi||)
siṁdeḍisĕkkusĕmaḍa sedam̐duḍuvam̐gam̐bode
aṁdugem̐ tā jagaḍiṁchī nāyam̐gā pani
kaṁduvalam̐ danamena gaṁdamu vūyam̐gabode
aṁdaṁde tappagasūsĕ nāyam̐gā pani

(||aṁdi||)
turumuvāḍum̐buvvulu tŏlam̐gam̐ diyyam̐gam̐bode
aramarai jaṁkiṁchī nāyam̐gā pani
garima vaṁchinamomu kani alasidivaṁṭe
arudugā mārumomai āyam̐gā pani

(||aṁdi||)
appuḍu sĕdarinaṭṭihārālu sakkadŏbbide-
nappaḍi tām̐ gām̐giliṁchī nāyam̐gā pani
kappuramu movi kiyyam̐gā śhrīveṁkaḍabadi
appaḽiṁchĕ radula na nnāyam̐gā pani