Amde teliyaraadaa amgana nerubulellaa

అందే తెలియరాదా అంగన నేరుపులెల్లా
Language

(॥పల్లవి॥)
అందే తెలియరాదా అంగన నేరుపులెల్లా
కందువ తారుకాణలు గలిగె విూ కిపుడు

(॥అందే॥)
నిద్దపు నొసలిమీఁద నిలువుఁ గస్తూరిబొట్టు
అద్దము చూచి గోర నటు దిద్దఁగా
వొద్దిక వెనకవంకనుండి నీ నీడగని
ముద్దుచూపి సన్నసేసే మొరఁగు లేలయ్యా

(॥అందే॥)
గుబ్బలపై మాణికాలఁ గుచ్చిన హరములు
అబ్బురానఁ దలవంచి యమరించఁగా
నిబ్బరాన నీ వెదుట నిలిచితే నీ నీడ
గబ్బితనమునఁ గని కౌఁగిలించె నదివో

(॥అందే॥)
మించుబంగారు వావాలు మెట్టఁగా శ్రీవేంకటేశ
చంచుల నీవునుఁ దన సరి నుండఁగా
నించి గోరిమెఱుఁగులో నీరూపు వొడగని
అంచల నిన్నుఁ గలసె నదే మెచ్చరాదా

(||pallavi||)
aṁde tĕliyarādā aṁgana nerubulĕllā
kaṁduva tārugāṇalu galigĕ viూ kibuḍu

(||aṁde||)
niddabu nŏsalimīm̐da niluvum̐ gastūribŏṭṭu
addamu sūsi gora naḍu diddam̐gā
vŏddiga vĕnagavaṁkanuṁḍi nī nīḍagani
muddusūbi sannasese mŏram̐gu lelayyā

(||aṁde||)
gubbalabai māṇigālam̐ guchchina haramulu
abburānam̐ dalavaṁchi yamariṁcham̐gā
nibbarāna nī vĕduḍa niliside nī nīḍa
gabbidanamunam̐ gani kaum̐giliṁchĕ nadivo

(||aṁde||)
miṁchubaṁgāru vāvālu mĕṭṭam̐gā śhrīveṁkaḍeśha
saṁchula nīvunum̐ dana sari nuṁḍam̐gā
niṁchi gorimĕṟum̐gulo nīrūbu vŏḍagani
aṁchala ninnum̐ galasĕ nade mĕchcharādā