అందరునుఁ గన్నపనే అంతే చాలు
(॥పల్లవి॥)
అందరునుఁ గన్నపనే అంతే చాలు
గొందికి నన్నుఁ దియ్యకు కోపము వచ్చీని
(॥అంద॥)
చెప్పరాదు నీబత్తి చెక్కులవెంటాఁ గారి
ముప్పిరి జారినకొప్పు ముడిచేపు
దప్పిదేరితి నప్పుడే తనిసితి నీవంక
కప్పుర మియ్యకు నాకుఁ గాఁకలు రేఁగీని
(॥అంద॥)
యెంతలేదు నీనిజము యెదుటనే వుట్టిపడి
అంతకంతకె నామీఁద నానవెట్టేవు
చింత వాసె నీవంక సిగ్గులెల్లాఁ దీరితిని
మంతనమాడకు నాతో మచ్చకా లెక్కీని
(॥అంద॥)
సాకిరేల నీగుణాలు సరివచ్చి వుండఁగాను
కైకొని కాఁగిట నన్నుఁ గలసితివి
మేకొని శ్రీ వేంకటేశ మెచ్చితి నిన్నన్నిటాను
నాకు నీకు బాసలేల నవ్వులువచ్చీని
(||pallavi||)
aṁdarunum̐ gannabane aṁte sālu
gŏṁdigi nannum̐ diyyagu kobamu vachchīni
(||aṁda||)
sĕpparādu nībatti sĕkkulavĕṁṭām̐ gāri
muppiri jārinagŏppu muḍisebu
dappideridi nappuḍe tanisidi nīvaṁka
kappura miyyagu nāgum̐ gām̐kalu rem̐gīni
(||aṁda||)
yĕṁtaledu nīnijamu yĕduḍane vuṭṭibaḍi
aṁtagaṁtagĕ nāmīm̐da nānavĕṭṭevu
siṁta vāsĕ nīvaṁka siggulĕllām̐ dīridini
maṁtanamāḍagu nādo machchagā lĕkkīni
(||aṁda||)
sāgirela nīguṇālu sarivachchi vuṁḍam̐gānu
kaigŏni kām̐giḍa nannum̐ galasidivi
megŏni śhrī veṁkaḍeśha mĕchchidi ninnanniḍānu
nāgu nīgu bāsalela navvuluvachchīni