(॥పల్లవి॥)
అందరుఁ జూడఁగ నీవురా నీవు
అందుకోలు జాణ వేరా నీవు
(॥అందరు॥)
చాయల కొలువు సందడిలోనే
ఆయము లంటేవు అవురా నీవు
రాయడి మద్దెల రవళి లోనే
కాయజువేదము గల్పించే వేరా
(॥అందరు॥)
నిలువుటద్దము నీడలలోనే
అల మోవి యానే వౌరా నీవు
సొలసి యాడే జుజాలలోనే
యలమేవు చన్ను లౌరా నీవు
(॥అందరు॥)
చెందమ్మిపాదాలు చే నొత్తఁ గానే
అందందే కూడేవు అవురా నీవు
విందువలెనే శ్రీవేంకటేరాయ
అందుకే మెచ్చే వేరా నీవు
(||pallavi||)
aṁdarum̐ jūḍam̐ga nīvurā nīvu
aṁdugolu jāṇa verā nīvu
(||aṁdaru||)
sāyala kŏluvu saṁdaḍilone
āyamu laṁṭevu avurā nīvu
rāyaḍi maddĕla ravaḽi lone
kāyajuvedamu galbiṁche verā
(||aṁdaru||)
niluvuḍaddamu nīḍalalone
ala movi yāne vaurā nīvu
sŏlasi yāḍe jujālalone
yalamevu sannu laurā nīvu
(||aṁdaru||)
sĕṁdammibādālu se nŏttam̐ gāne
aṁdaṁde kūḍevu avurā nīvu
viṁduvalĕne śhrīveṁkaḍerāya
aṁduge mĕchche verā nīvu