Amdarum jepperu vinu adi dagavaa

అందరుఁ జెప్పేరు విను అది దగవా
Language

(॥పల్లవి॥)
అందరుఁ జెప్పేరు విను అది దగవా
యిందరిలో బొంకను నీ కిది దగవా

(॥అందరు॥)
చేరి గొల్లెతలు నీతో చీఁకటితప్పు సేసితే
ఆరితేరి నవ్వితివి అద దగవా
చీరలు దీసితి వట చేరి కొలనిదరిని
యీరీతి నింతటిదొర విది దగవా

(॥అందరు॥)
చెలఁగి వుట్లపై దాఁచిన వెన్నలునుఁ బాలు
అలమి ఆరగించితి వది దగవా
కలపితి వట వారికట్టినదూడల నాల
యిలపై నీ వుద్దండాలు యింత దగవా

(॥అందరు॥)
చక్కిలాలు నురుగు సతులు దాఁచిన వెల్ల
అక్కరఁ గైకొంటి మాట అది దగనా
గుక్కక శ్రీవెంకటాద్రికోమలపుకృష్ణుఁడవై
యెక్కి వేసాలు సేసే విది దగవా

(||pallavi||)
aṁdarum̐ jĕpperu vinu adi dagavā
yiṁdarilo bŏṁkanu nī kidi dagavā

(||aṁdaru||)
seri gŏllĕdalu nīdo sīm̐kaḍidappu seside
ārideri navvidivi ada dagavā
sīralu dīsidi vaḍa seri kŏlanidarini
yīrīdi niṁtaḍidŏra vidi dagavā

(||aṁdaru||)
sĕlam̐gi vuṭlabai dām̐sina vĕnnalunum̐ bālu
alami āragiṁchidi vadi dagavā
kalabidi vaḍa vārigaṭṭinadūḍala nāla
yilabai nī vuddaṁḍālu yiṁta dagavā

(||aṁdaru||)
sakkilālu nurugu sadulu dām̐sina vĕlla
akkaram̐ gaigŏṁṭi māḍa adi daganā
gukkaga śhrīvĕṁkaḍādrigomalabukṛṣhṇum̐ḍavai
yĕkki vesālu sese vidi dagavā