Amdaru vinnaa vinanee yaadem gaani

అందరు విన్నా విననీ యాడేఁ గాని
Language

(॥పల్లవి॥)
అందరు విన్నా విననీ యాడేఁ గాని
సందడింపు మేకులకుఁ జాలఁబో నేనూ

(॥అంద॥)
సేయరా నీపనులెల్లాఁ జేసేఁ గాని
వోయయ్య నీవినయాల కోపఁబో నేను
పాయరానిరాజసానం బడేఁ గాని
వేయైనా నీయానలు వినలేఁబో నేను

(॥అంద॥)
నగవు రాకుండినా నవ్వేఁ గాని
వొగరు మోహలు చల్లనోపఁబో నేను
మొగమోటఁ గొండెత్తినా మోచేఁ గాని
తెగువతో నీగుణాలు తిద్దలేఁబో నేను

(॥అంద॥)
వొదిగి పానుపుమీఁద నుండేఁ గాని
చెదర నిన్నింత వచ్చి సేయలేఁబో నేను
పొదిగి శ్రీవేంకటేశ భోగించితి నన్ను
వెదకి నీ వెందుండినా విడువలేఁబో నేను

(||pallavi||)
aṁdaru vinnā vinanī yāḍem̐ gāni
saṁdaḍiṁpu megulagum̐ jālam̐bo nenū

(||aṁda||)
seyarā nībanulĕllām̐ jesem̐ gāni
voyayya nīvinayāla kobam̐bo nenu
pāyarānirājasānaṁ baḍem̐ gāni
veyainā nīyānalu vinalem̐bo nenu

(||aṁda||)
nagavu rāguṁḍinā navvem̐ gāni
vŏgaru mohalu sallanobam̐bo nenu
mŏgamoḍam̐ gŏṁḍĕttinā mosem̐ gāni
tĕguvado nīguṇālu tiddalem̐bo nenu

(||aṁda||)
vŏdigi pānubumīm̐da nuṁḍem̐ gāni
sĕdara ninniṁta vachchi seyalem̐bo nenu
pŏdigi śhrīveṁkaḍeśha bhogiṁchidi nannu
vĕdagi nī vĕṁduṁḍinā viḍuvalem̐bo nenu