అందరు నెఱిఁగినవే అన్నిపనులు
(॥పల్లవి॥)
అందరు నెఱిఁగినవే అన్నిపనులు
అందియ్యరాదా వీడె మంత సిగ్గులేఁటికి
(॥॥)
చిప్పిలి చెమటనీరు చెక్కుల వెంటాఁ గారఁగా
చెప్పరాని వూడిగాలు సేసీనాపె
దప్పిదేరే మోవితోడ దగదొట్టి మాటలాడీఁ
గప్పురమైనా నీరాదా కడు సిగ్గులేఁటికి
(॥॥)
పెనుఁదురు మట్టే వీడి పిక్కలవెంటా జారఁగా
పెనఁగి నిన్నుఁ బిలిచీ ప్రియురాలు
నినుపు నిట్టూర్పులతో నిలుచుండి నవ్వు నవ్వీ
యెనసి విసరరాదా యింకా సిగ్గులేఁటికి
(॥॥)
పూసిన కస్తూరిపూత పొడివొడియై రాలఁగ
అసల నలమేల్మంగ అలమీ నిన్ను
యీసులేక శ్రీవేంకటేశ యేలితివి మమ్ముఁ
జేసుకొన్నపతి వింతే సిగ్గువడనేటికి
(||pallavi||)
aṁdaru nĕṟim̐ginave annibanulu
aṁdiyyarādā vīḍĕ maṁta siggulem̐ṭigi
(||||)
sippili sĕmaḍanīru sĕkkula vĕṁṭām̐ gāram̐gā
sĕpparāni vūḍigālu sesīnābĕ
dappidere movidoḍa dagadŏṭṭi māḍalāḍīm̐
gappuramainā nīrādā kaḍu siggulem̐ṭigi
(||||)
pĕnum̐duru maṭṭe vīḍi pikkalavĕṁṭā jāram̐gā
pĕnam̐gi ninnum̐ bilisī priyurālu
ninubu niṭṭūrbulado nilusuṁḍi navvu navvī
yĕnasi visararādā yiṁkā siggulem̐ṭigi
(||||)
pūsina kastūribūda pŏḍivŏḍiyai rālam̐ga
asala nalamelmaṁga alamī ninnu
yīsulega śhrīveṁkaḍeśha yelidivi mammum̐
jesugŏnnabadi viṁte sigguvaḍaneḍigi