అందరూ విన్నవి నే నాడేఁ గాని
(॥పల్లవి॥)
అందరూ విన్నవి నే నాడేఁ గాని
సందడింపు మేకులకు చాలఁ బో నేనూ
(॥అందర॥)
సేయ రానిపను లైనఁ జేసేఁ గాని
వో యయ్య నీ వినయము లొల్లఁ బో నేను
పాయరానిరాజసాన బడేఁగాని
వే యైన నీయానలు వినలేఁ బో నేనూ
(॥అందర॥)
నగవు రాకుండినను నవ్వేఁ గాని
వొగరు మోహము చల్ల నోపఁ బో నేను
మొగమోటఁ గొండెత్తిన మోచేఁ గాని
తెగువతో నీ గుణము తిద్దలేఁ బో నేనూ
(॥అందర॥)
వొదిగి పానుపుమీఁద నుండేఁ గాని
చెదర నిన్నింత పచ్చి నేయఁ బో నేను
పొదిగి శ్రీవెంకటేశ భోగించితి నీవు
వెదకి నీ వెం దున్న విడువలేఁ బో నేనూ
(||pallavi||)
aṁdarū vinnavi ne nāḍem̐ gāni
saṁdaḍiṁpu megulagu sālam̐ bo nenū
(||aṁdara||)
seya rānibanu lainam̐ jesem̐ gāni
vo yayya nī vinayamu lŏllam̐ bo nenu
pāyarānirājasāna baḍem̐gāni
ve yaina nīyānalu vinalem̐ bo nenū
(||aṁdara||)
nagavu rāguṁḍinanu navvem̐ gāni
vŏgaru mohamu salla nobam̐ bo nenu
mŏgamoḍam̐ gŏṁḍĕttina mosem̐ gāni
tĕguvado nī guṇamu tiddalem̐ bo nenū
(||aṁdara||)
vŏdigi pānubumīm̐da nuṁḍem̐ gāni
sĕdara ninniṁta pachchi neyam̐ bo nenu
pŏdigi śhrīvĕṁkaḍeśha bhogiṁchidi nīvu
vĕdagi nī vĕṁ dunna viḍuvalem̐ bo nenū