Amdarivamtidi gaadu amgana yeevi

అందరివంటిది గాదు అంగన యీవి
Language

(॥పల్లవి॥)
అందరివంటిది గాదు అంగన యీవి
నిందల నీ గుణములు నెరపకుమీ

(॥అంద॥)
సెలవుల నవ్వునవ్వి చెక్కులు గోర నొక్కి
వలపులు చల్లితివి వనితమీఁద
నిలువున నమ్మె నాపె నిజమరివని నిన్ను
తలఁపులు మరివేరే తలఁచకుమీ

(॥అంద॥)
అందపుమాట లాడి ఆయములు సోఁకించి
విందుగా మోవిచ్చితివి వెలఁదికిని
కందువలఁ జొక్కె నాపె కాణాచి దీడ నఁ కని
అందాలకుఁ బరుల పొందా లించకుమీ

(॥అంద॥)
గక్కన గాఁగిటఁ గూడి కైకొని శ్రీవేంకటేశ
యెక్కించితివి వురముపై యీరమణిని
మొక్కె నాపె నీవే తనమోహనపుసింహాసనమని
పక్కన నేమిటా నిఁకఁ బదరకుమీ

(||pallavi||)
aṁdarivaṁṭidi gādu aṁgana yīvi
niṁdala nī guṇamulu nĕrabagumī

(||aṁda||)
sĕlavula navvunavvi sĕkkulu gora nŏkki
valabulu sallidivi vanidamīm̐da
niluvuna nammĕ nābĕ nijamarivani ninnu
talam̐pulu marivere talam̐sagumī

(||aṁda||)
aṁdabumāḍa lāḍi āyamulu som̐kiṁchi
viṁdugā movichchidivi vĕlam̐digini
kaṁduvalam̐ jŏkkĕ nābĕ kāṇāsi dīḍa nam̐ kani
aṁdālagum̐ barula pŏṁdā liṁchagumī

(||aṁda||)
gakkana gām̐giḍam̐ gūḍi kaigŏni śhrīveṁkaḍeśha
yĕkkiṁchidivi vuramubai yīramaṇini
mŏkkĕ nābĕ nīve tanamohanabusiṁhāsanamani
pakkana nemiḍā nim̐kam̐ badaragumī