Amdarivamtidaananaa ayyo tanagu

అందరివంటిదాననా అయ్యో తనకు
Language

(॥పల్లవి॥)
అందరివంటిదాననా అయ్యో తనకు
మందలించి తన సేవే మన్నించీననవే

(॥॥)
తనపై నేఁ జేసే బత్తి తగ నాకుఁ దోడై వచ్చి
వినయము నాదే నన్ను వెలయించీని
యెనసిన యిచ్చకమే యీడేరించీ నన్ను
కనుఁగొని తన్ను నింత కక్కసించ నేఁటికే

(॥॥)
కమ్మి తనకుఁ గట్టిన కంకణమే మేలై వచ్చి
నమ్మిన నమ్మికలె నన్నుఁగాచీని
ఇమ్ముల నా కోరికలే యిట్టే తన్నుఁదోడి తెచ్చి
చిమ్ముచుండను బలిమి సేయవచ్చు నటవే

(॥॥)
సొరిది నే వినే తన సుద్దులే ఫల మిచ్చి
బెరసి నా తమకమే పెండ్లి సేసీని
యిరవై శ్రీ వేకంటేశుఁ డింతలోఁ దా నన్నుఁగూడె
సరికి బేసికిఁ దన్ను సాదించఁ దగునా

(||pallavi||)
aṁdarivaṁṭidānanā ayyo tanagu
maṁdaliṁchi tana seve manniṁchīnanave

(||||)
tanabai nem̐ jese batti taga nāgum̐ doḍai vachchi
vinayamu nāde nannu vĕlayiṁchīni
yĕnasina yichchagame yīḍeriṁchī nannu
kanum̐gŏni tannu niṁta kakkasiṁcha nem̐ṭige

(||||)
kammi tanagum̐ gaṭṭina kaṁkaṇame melai vachchi
nammina nammigalĕ nannum̐gāsīni
immula nā korigale yiṭṭe tannum̐doḍi tĕchchi
simmusuṁḍanu balimi seyavachchu naḍave

(||||)
sŏridi ne vine tana suddule phala michchi
bĕrasi nā tamagame pĕṁḍli sesīni
yiravai śhrī vegaṁṭeśhum̐ ḍiṁtalom̐ dā nannum̐gūḍĕ
sarigi besigim̐ dannu sādiṁcham̐ dagunā