అందరివల్లా నీవే ఆరడయ్యేవనికాక
(॥పల్లవి॥)
అందరివల్లా నీవే ఆరడయ్యేవనికాక
పందెమడచినయట్టు పట్టియ్య నోపనా
(॥అంద॥)
నవ్వులకు నొకమాటు నన్ను నీవు చెనకితే
రవ్వలు సేసిరి నీరమణులెల్లా
జవ్వను లిందరిలోనా సాదులా తా మేమైనా
పువ్వకపూచె ననుచు పురిఁ జాటనోపనా
(॥అంద॥)
మచ్చికతో నీవు నేఁడు మాయింటికి వచ్చితేను
పచ్చిసేసేరు నీతొంటిపడఁతులెల్లా
నిచ్చనిచ్చా నీవిద్దయలు నేరనివారా తాము
గచ్చుల తమగు ట్టంగడి వేయనోపనా
(॥అంద॥)
కందువతో నవు నన్నుఁ గాఁగిలించి కూడితేను
నిందలు గట్టేరు యీనేలఁతలెల్లా
అందపు శ్రీవేంకటేశ అండ్లు గారా తాము నీకు
మందగొల్లెతలనెల్లా మర్మాలెత్తనోపనా
(||pallavi||)
aṁdarivallā nīve āraḍayyevanigāga
paṁdĕmaḍasinayaṭṭu paṭṭiyya nobanā
(||aṁda||)
navvulagu nŏgamāḍu nannu nīvu sĕnagide
ravvalu sesiri nīramaṇulĕllā
javvanu liṁdarilonā sādulā tā memainā
puvvagabūsĕ nanusu purim̐ jāḍanobanā
(||aṁda||)
machchigado nīvu nem̐ḍu māyiṁṭigi vachchidenu
pachchiseseru nīdŏṁṭibaḍam̐tulĕllā
nichchanichchā nīviddayalu neranivārā tāmu
gachchula tamagu ṭṭaṁgaḍi veyanobanā
(||aṁda||)
kaṁduvado navu nannum̐ gām̐giliṁchi kūḍidenu
niṁdalu gaṭṭeru yīnelam̐talĕllā
aṁdabu śhrīveṁkaḍeśha aṁḍlu gārā tāmu nīgu
maṁdagŏllĕdalanĕllā marmālĕttanobanā