అందరివలెనేచూచే వప్పటి నన్ను నీవు
(॥పల్లవి॥)
అందరివలెనేచూచే వప్పటి నన్ను నీవు
సందడి మందమిరేలు చల్లఁగా నేను
(॥అంద॥)
సరసములాడుతానే చలము సాదించె నాపె
యిరవైతి నింతసేయ నే నోపఁగా
తరుణి పాదాలొత్తుతా తానే తాఁకించే గోరు
వొరసి మేరలుదప్ప నోపఁగా నేను
(॥అంద॥)
కదిసి మాటాడుతానే కాఁకలురేఁచె నాపె
యిదివో నేనైతేను ఇంతకోపఁగా
చదురంగమాడుతానే సారెసారె నుఁ దిట్టె
వుదుటున గాతసేయ నోపఁగా నేను
(॥అంద॥)
గారవానఁ గూడుతానే గంటిసేసె మోవి యాపె
యీరీతి నిన్ను జరయ నింతకోపఁగా
కోరి శ్రీవేంకటగిరి గోవిందనన్నేలితివి
వూరకే నిన్ను దూరనోపఁగా నేను
(||pallavi||)
aṁdarivalĕnesūse vappaḍi nannu nīvu
saṁdaḍi maṁdamirelu sallam̐gā nenu
(||aṁda||)
sarasamulāḍudāne salamu sādiṁchĕ nābĕ
yiravaidi niṁtaseya ne nobam̐gā
taruṇi pādālŏttudā tāne tām̐kiṁche goru
vŏrasi meraludappa nobam̐gā nenu
(||aṁda||)
kadisi māḍāḍudāne kām̐kalurem̐sĕ nābĕ
yidivo nenaidenu iṁtagobam̐gā
saduraṁgamāḍudāne sārĕsārĕ num̐ diṭṭĕ
vuduḍuna gādaseya nobam̐gā nenu
(||aṁda||)
gāravānam̐ gūḍudāne gaṁṭisesĕ movi yābĕ
yīrīdi ninnu jaraya niṁtagobam̐gā
kori śhrīveṁkaḍagiri goviṁdanannelidivi
vūrage ninnu dūranobam̐gā nenu