Amdarivalene vunnaam daadadaam veemdu

అందరివలెనే వున్నాఁ డాతడాఁ వీఁడు
Language

(॥పల్లవి॥)
అందరివలెనే వున్నాఁ డాతడాఁ వీఁడు
యిందుముఖులఁ గూడినాఁ డీతఁడానాఁడు

(॥అంద॥)
యిందరూ నేఁటేఁట జేసే యింద్రయాగపు ముద్దలు
అందుకొని యారగించినాతఁడా వీఁడు
చెంది మునులసతుల సతఁ దెప్పించుక మంచి-
విందు లారగించినాఁడు వీఁ డానాఁడు

(॥అంద॥)
తొలుత బ్రహ్మ దాఁచిన దూడలకు బాలులకు
అలరి మారు గడించినాతఁడా వీఁడు
నిలుచుం డేడుదినాలు నెమ్మది వేలఁ గొండెత్తి
యిల నావులఁ గాచినాఁ డీతఁ డానాఁడు

(॥అంద॥)
బాలుఁడై పూతనాదుల బలురక్కసులఁ జంపి
ఆలరి యాటలాడిన యాతఁడా వీఁడు
యీలీల శ్రీవేంకటాద్రి యెక్కినాఁడు తొలుతే
యేలెను బ్రహ్మాదుల నీతఁ డానాఁడు

(||pallavi||)
aṁdarivalĕne vunnām̐ ḍādaḍām̐ vīm̐ḍu
yiṁdumukhulam̐ gūḍinām̐ ḍīdam̐ḍānām̐ḍu

(||aṁda||)
yiṁdarū nem̐ṭem̐ṭa jese yiṁdrayāgabu muddalu
aṁdugŏni yāragiṁchinādam̐ḍā vīm̐ḍu
sĕṁdi munulasadula sadam̐ dĕppiṁchuga maṁchi-
viṁdu lāragiṁchinām̐ḍu vīm̐ ḍānām̐ḍu

(||aṁda||)
tŏluda brahma dām̐sina dūḍalagu bālulagu
alari māru gaḍiṁchinādam̐ḍā vīm̐ḍu
nilusuṁ ḍeḍudinālu nĕmmadi velam̐ gŏṁḍĕtti
yila nāvulam̐ gāsinām̐ ḍīdam̐ ḍānām̐ḍu

(||aṁda||)
bālum̐ḍai pūdanādula balurakkasulam̐ jaṁpi
ālari yāḍalāḍina yādam̐ḍā vīm̐ḍu
yīlīla śhrīveṁkaḍādri yĕkkinām̐ḍu tŏlude
yelĕnu brahmādula nīdam̐ ḍānām̐ḍu