అందరివలెనే చూచే వప్పటి నన్ను
(॥పల్లవి॥)
అందరివలెనే చూచే వప్పటి నన్ను
నిందలు నిన్నాడుదునా నేఁ బొగడుచుఁ గాక
(॥॥)
చలమరినా నీతో సారెసారెఁ బెనఁగను
చెలరేఁగి చెప్పినట్టు సేతుఁ గాక
పెలుచుదాననా నీతోఁ బెడసరాలాడను
మెలఁగి ప్రియాలు చెప్పి మెప్పింతుఁ గాక
(॥॥)
కోపకతైనా నిన్ను కొసరుచు జంకించఁగ
వోపి నీతో నవ్వుతానే వుండుదుఁ గాక
రాఁపులదాననా నిను రచ్చల నాఱడిసేయ
చూపులనే తమిరేఁచి చొక్కింతుఁ గాక
(॥॥)
కొత్తదాననా నిన్నుఁ గోరి మనసుచూడఁగ
బత్తిసేసి కాఁగిలించి పైకొందుఁ గాక
యిత్తల శ్రీ వేంకటేశ యిన్నిటా నన్నేలితివి
గుత్తపుగుబ్బల నొత్తి కొసరుదుఁ గాక
(||pallavi||)
aṁdarivalĕne sūse vappaḍi nannu
niṁdalu ninnāḍudunā nem̐ bŏgaḍusum̐ gāga
(||||)
salamarinā nīdo sārĕsārĕm̐ bĕnam̐ganu
sĕlarem̐gi sĕppinaṭṭu sedum̐ gāga
pĕlusudānanā nīdom̐ bĕḍasarālāḍanu
mĕlam̐gi priyālu sĕppi mĕppiṁtum̐ gāga
(||||)
kobagadainā ninnu kŏsarusu jaṁkiṁcham̐ga
vobi nīdo navvudāne vuṁḍudum̐ gāga
rām̐puladānanā ninu rachchala nāṟaḍiseya
sūbulane tamirem̐si sŏkkiṁtum̐ gāga
(||||)
kŏttadānanā ninnum̐ gori manasusūḍam̐ga
battisesi kām̐giliṁchi paigŏṁdum̐ gāga
yittala śhrī veṁkaḍeśha yinniḍā nannelidivi
guttabugubbala nŏtti kŏsarudum̐ gāga