అందరిని యీమాఁటే అడుగవయ్యా
(॥పల్లవి॥)
అందరిని యీమాఁటే అడుగవయ్యా
కందువలు నీకు నీకే కానరాదుగానీ
(॥అంద॥)
వనిత యిప్పుడే నీవద్దికి రాఁగానే
మనసు నీ కొక్కటాయ మాఁటలేఁటికి
చెనకి నే మిందాఁకాఁ జేసినచేఁతలకెల్లా
వొనరి యిటువలెనే వుండుగా నీమొగము
(॥అంద॥)
చాఁచి చాఁచి నీ కాపె సారె విడెమియ్యఁగానే
పూఁచినపూఁవు లీడేరె బొంకులేఁటికి
తూఁచి వలపు నేమెల్లా తోడగడ్డెము వేయఁగా
పాఁచి సంతోసాలిట్లాఁ బ్రబలెనా నీకు
(॥అంద॥)
గక్కన నీదేవు లిట్టె కాఁగిలించుకొనఁగానే
చక్కనాయఁ బనులెల్లా సటలేఁటికి
యిక్కువ శ్రీవేంకటేశ యిద్దరూఁ గూడఁగాఁగాక
చిక్కనినవ్వు లిట్లాఁ జేకూడెనా
(||pallavi||)
aṁdarini yīmām̐ṭe aḍugavayyā
kaṁduvalu nīgu nīge kānarādugānī
(||aṁda||)
vanida yippuḍe nīvaddigi rām̐gāne
manasu nī kŏkkaḍāya mām̐ṭalem̐ṭigi
sĕnagi ne miṁdām̐kām̐ jesinasem̐talagĕllā
vŏnari yiḍuvalĕne vuṁḍugā nīmŏgamu
(||aṁda||)
sām̐si sām̐si nī kābĕ sārĕ viḍĕmiyyam̐gāne
pūm̐sinabūm̐vu līḍerĕ bŏṁkulem̐ṭigi
tūm̐si valabu nemĕllā toḍagaḍḍĕmu veyam̐gā
pām̐si saṁtosāliṭlām̐ brabalĕnā nīgu
(||aṁda||)
gakkana nīdevu liṭṭĕ kām̐giliṁchugŏnam̐gāne
sakkanāyam̐ banulĕllā saḍalem̐ṭigi
yikkuva śhrīveṁkaḍeśha yiddarūm̐ gūḍam̐gām̐gāga
sikkaninavvu liṭlām̐ jegūḍĕnā