Amdarilo neevu nannu naasagolibevugaaga

అందరిలో నీవు నన్ను నాసకొలిపేవుగాక
Language

(॥పల్లవి॥)
అందరిలో నీవు నన్ను నాసకొలిపేవుగాక
పొందు నీకే కలిగితే భోగించవా

(॥అంద॥)
చిత్తము రా నీ సేవ సేగలఁగాక నీకు
బత్తి గొట్టానఁ బెట్టేనా పలుమారును
వత్తునఁటా జెప్పెంపేవు వారివీరిచేత నేఁడు
వొత్తి నే నంతక తొల్లి వొద్దంటినా

(॥అంద॥)
సముకాన నుండి సరసము లాడఁగలఁగాక
తమకము రేఁచేనా తగిలి నీకు
చెమటలు గారఁగాను చేతులు చాఁచేవు నీవు
అమరఁ గాఁగిలించఁగా నౌఁగాదనేనా

(॥అం॥)
ననుపు సేసుక నీతో నవ్వు నవ్వఁగలఁగాక
పెనఁగి గుణము చక్కఁబెట్టేనా నేను
యెనసితివి శ్రీ వేంకటేశ ఇంతలోనే నన్ను
వొనర కెన్నండైనా వొడ్డుకొంటినా

(||pallavi||)
aṁdarilo nīvu nannu nāsagŏlibevugāga
pŏṁdu nīge kaligide bhogiṁchavā

(||aṁda||)
sittamu rā nī seva segalam̐gāga nīgu
batti gŏṭṭānam̐ bĕṭṭenā palumārunu
vattunam̐ṭā jĕppĕṁpevu vārivīriseda nem̐ḍu
vŏtti ne naṁtaga tŏlli vŏddaṁṭinā

(||aṁda||)
samugāna nuṁḍi sarasamu lāḍam̐galam̐gāga
tamagamu rem̐senā tagili nīgu
sĕmaḍalu gāram̐gānu sedulu sām̐sevu nīvu
amaram̐ gām̐giliṁcham̐gā naum̐gādanenā

(||aṁ||)
nanubu sesuga nīdo navvu navvam̐galam̐gāga
pĕnam̐gi guṇamu sakkam̐bĕṭṭenā nenu
yĕnasidivi śhrī veṁkaḍeśha iṁtalone nannu
vŏnara kĕnnaṁḍainā vŏḍḍugŏṁṭinā