(॥పల్లవి॥)
అందరిలో నీవౌఁ గదవే
అందితివి పదవులౌఁ గదవే
(॥అంద॥)
చతురతఁ దెరలోసందించినవా
రతఁడును నీవును నౌఁగదవే
కతలు చెప్పుతా గయ్యాళిఁచితి
వతివెవు నీవే యౌఁగదవే
(॥అంద॥)
తప్పక యింటిలోఁ దమ్ములముమిసితి
రప్పసము మీరె యౌఁగదవే
ముప్పిరి నగితివి మునుపన యేఁటికొ
అప్పడు నీవే యౌఁగదవే
(॥అంద॥)
మక్కువ ననునిటు మన్నింపించితి
వక్కరొ నీవే యౌఁగదవే
వెక్కసముగ శ్రీ వెంకటేశ్వరుని
యక్కున నిలిచితి వవుఁగదవే
(||pallavi||)
aṁdarilo nīvaum̐ gadave
aṁdidivi padavulaum̐ gadave
(||aṁda||)
saduradam̐ dĕralosaṁdiṁchinavā
radam̐ḍunu nīvunu naum̐gadave
kadalu sĕppudā gayyāḽim̐sidi
vadivĕvu nīve yaum̐gadave
(||aṁda||)
tappaga yiṁṭilom̐ dammulamumisidi
rappasamu mīrĕ yaum̐gadave
muppiri nagidivi munubana yem̐ṭigŏ
appaḍu nīve yaum̐gadave
(||aṁda||)
makkuva nanuniḍu manniṁpiṁchidi
vakkarŏ nīve yaum̐gadave
vĕkkasamuga śhrī vĕṁkaḍeśhvaruni
yakkuna nilisidi vavum̐gadave