(॥పల్లవి॥)
అందరికిఁ గల చాలే యంగనలాల
పొందుసేయవలెఁగాక పోరాడనేఁటికే
(॥అంద॥)
పట్టఁగరాదు మనసు పాయరాదు చెలిమి
ఇట్టి బుద్దులు చెలు లేమిచెప్పేరే
జట్టి గొన్నవాఁ డతఁడు సమ్మతైనదాన నేను
చుట్టాలింతే మీరు మమ్ము జోడువాపనేఁటికే
(॥అంద॥)
మచ్చిక మానుపరాదు మర్మాలు దాఁచఁగరాదు
రచ్చవేసి నన్ను నేల రాయడించేరే
మెచ్చి పెండ్లాడె నతఁడు మేనదానఁదొల్లె నేను
నెచ్చెలు లింతే మీరు నేరాలెంచనేఁటికే
(॥అంద॥)
ఆస విడిపించరాదు ఆనంద మాఁపఁగరాదు
వేసరించి నన్నునేల వెంగేలాడేరే
సేసవెట్టి నన్నుఁ గూడె శ్రీవేంకటేశ్వరుఁడు
నాసరివారె మీరు నవ్వు నవ్వనేఁటికే
(||pallavi||)
aṁdarigim̐ gala sāle yaṁganalāla
pŏṁduseyavalĕm̐gāga porāḍanem̐ṭige
(||aṁda||)
paṭṭam̐garādu manasu pāyarādu sĕlimi
iṭṭi buddulu sĕlu lemisĕppere
jaṭṭi gŏnnavām̐ ḍadam̐ḍu sammadainadāna nenu
suṭṭāliṁte mīru mammu joḍuvābanem̐ṭige
(||aṁda||)
machchiga mānubarādu marmālu dām̐sam̐garādu
rachchavesi nannu nela rāyaḍiṁchere
mĕchchi pĕṁḍlāḍĕ nadam̐ḍu menadānam̐dŏllĕ nenu
nĕchchĕlu liṁte mīru nerālĕṁchanem̐ṭige
(||aṁda||)
āsa viḍibiṁcharādu ānaṁda mām̐pam̐garādu
vesariṁchi nannunela vĕṁgelāḍere
sesavĕṭṭi nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhvarum̐ḍu
nāsarivārĕ mīru navvu navvanem̐ṭige