అందరికిఁ గల చాలే ఆఁడువారైన వారికి
(॥పల్లవి॥)
అందరికిఁ గల చాలే ఆఁడువారైన వారికి
కందువల ముందరెత్తు కనుఁగొనరే
(॥॥)
చెలులాల మీ తోను చెప్పీ నంటే సిగ్గయీ
తలఁపులో నాఁపరావు తమకములు
వలరాజు బలములు వారించ పసగావు
తెలుసుకోరే మీరు తెగని నాకోరిక
(॥॥)
చేరి మీ మోము చూచితే సెలవుల నవ్వు వచ్చి
వూరకుండితే నిట్టూర్పు లుమ్మగిలీని
నీరు వంటిది వయసు నిప్పు వంటిది వలపు
తారుకాణించఁగ రాదు తలఁచుకోరే
(॥॥)
యెట్టని మీ రడిగితేఁ దొట్టీ నాలోని గుట్టు
పట్ట రావు వేడుక లుపచరించక
యిట్టే శ్రీ వేంకటేశుఁడింతలోనే నన్నుఁగూడె
చుట్టరిక మిఁక మీరే చూచుకొనరే
(||pallavi||)
aṁdarigim̐ gala sāle ām̐ḍuvāraina vārigi
kaṁduvala muṁdarĕttu kanum̐gŏnare
(||||)
sĕlulāla mī tonu sĕppī naṁṭe siggayī
talam̐pulo nām̐parāvu tamagamulu
valarāju balamulu vāriṁcha pasagāvu
tĕlusugore mīru tĕgani nāgoriga
(||||)
seri mī momu sūside sĕlavula navvu vachchi
vūraguṁḍide niṭṭūrbu lummagilīni
nīru vaṁṭidi vayasu nippu vaṁṭidi valabu
tārugāṇiṁcham̐ga rādu talam̐sugore
(||||)
yĕṭṭani mī raḍigidem̐ dŏṭṭī nāloni guṭṭu
paṭṭa rāvu veḍuga lubasariṁchaga
yiṭṭe śhrī veṁkaḍeśhum̐ḍiṁtalone nannum̐gūḍĕ
suṭṭariga mim̐ka mīre sūsugŏnare