Amdarigi naavamti aase kaadaa

అందరికి నావంటి ఆసే కాదా
Language

(॥పల్లవి॥)
అందరికి నావంటి ఆసే కాదా
యిందుకేల వెఱవు నీ వెదురేఁగవయ్యా

(॥అంద॥)
మగిడి మగిడి చూచి మాటలాడ నూఁకించి
చిగురుఁబెదవి వంచి సిగ్గువడీని
మగుల నొయ్యనే చేరి మంతనాన బుజ్జగించి
పగడవాతెర నొక్కి పరికించవయ్యా

(॥అంద॥)
పొలసి పొలసి ఇంతి బొమ్మముడి వచరించి
మలసి పయ్యదకొంగు మాఁటుసేసీని
నెలకొన్న తొల్లింటినీయా కెయొడఁబాటు
సలిగెతోఁ జెల్లించి చనవియ్యవయ్యా

(॥అంద॥)
ఇక్కువల నాకె నిన్ను నెలఇంచఁగానే నన్ను
మక్కువచేఁతల నిట్టె మన్నించితివి
గక్కన శ్రీవేంకటేశ కపటము లిఁక మాని
అక్కరదీరఁగ నాకె నాదరించవయ్యా

(||pallavi||)
aṁdarigi nāvaṁṭi āse kādā
yiṁdugela vĕṟavu nī vĕdurem̐gavayyā

(||aṁda||)
magiḍi magiḍi sūsi māḍalāḍa nūm̐kiṁchi
sigurum̐bĕdavi vaṁchi sigguvaḍīni
magula nŏyyane seri maṁtanāna bujjagiṁchi
pagaḍavādĕra nŏkki parigiṁchavayyā

(||aṁda||)
pŏlasi pŏlasi iṁti bŏmmamuḍi vasariṁchi
malasi payyadagŏṁgu mām̐ṭusesīni
nĕlagŏnna tŏlliṁṭinīyā kĕyŏḍam̐bāḍu
saligĕdom̐ jĕlliṁchi sanaviyyavayyā

(||aṁda||)
ikkuvala nāgĕ ninnu nĕla̮iṁcham̐gāne nannu
makkuvasem̐tala niṭṭĕ manniṁchidivi
gakkana śhrīveṁkaḍeśha kabaḍamu lim̐ka māni
akkaradīram̐ga nāgĕ nādariṁchavayyā