అందరిపాలిటివాఁడు నాతఁడే కాఁడా
(॥పల్లవి॥)
అందరిపాలిటివాఁడు నాతఁడే కాఁడా
అందము లప్పుడే సేసీ నాతఁడే కాఁడా
(॥అంద॥)
యీడ నిన్నుఁబెట్టుకొని యెదురుమాటలు నాతో
నాడించేటిసూత్రధారి యతఁడే కాఁడా
పాడి దప్పి నిన్ను నంత వచ్చిసేయ నిఁక నేల
ఆడకు వచ్చేటివాఁడు నాతఁడే కాఁడా
(॥అంద॥)
మంతు కెక్కించి ని న్నింత మానిసిఁ జేసినవాఁడు
అంతటికి గురి యిఁక నాతఁడే కాఁడా
వంతాలు నీతో నేల పనిగలయప్పటికి
అంతరంగమయ్యేవాఁడు నాతఁడే కాఁడా
(॥అంద॥)
సరి నిన్ను నన్ను నొక్కజంట సేసి కాఁగిలించే
అరుదైనజాణకాఁడు ఆతఁడే కాఁడా
యిరవై శ్రీవేంకటేశుఁడిట్టె నన్నుఁ గూడేను
హరిమాయ లొనరించీ నాతఁడే కాఁడా
(||pallavi||)
aṁdaribāliḍivām̐ḍu nādam̐ḍe kām̐ḍā
aṁdamu lappuḍe sesī nādam̐ḍe kām̐ḍā
(||aṁda||)
yīḍa ninnum̐bĕṭṭugŏni yĕdurumāḍalu nādo
nāḍiṁcheḍisūtradhāri yadam̐ḍe kām̐ḍā
pāḍi dappi ninnu naṁta vachchiseya nim̐ka nela
āḍagu vachcheḍivām̐ḍu nādam̐ḍe kām̐ḍā
(||aṁda||)
maṁtu kĕkkiṁchi ni nniṁta mānisim̐ jesinavām̐ḍu
aṁtaḍigi guri yim̐ka nādam̐ḍe kām̐ḍā
vaṁtālu nīdo nela panigalayappaḍigi
aṁtaraṁgamayyevām̐ḍu nādam̐ḍe kām̐ḍā
(||aṁda||)
sari ninnu nannu nŏkkajaṁṭa sesi kām̐giliṁche
arudainajāṇagām̐ḍu ādam̐ḍe kām̐ḍā
yiravai śhrīveṁkaḍeśhum̐ḍiṭṭĕ nannum̐ gūḍenu
harimāya lŏnariṁchī nādam̐ḍe kām̐ḍā