అందరి ముందరనైతే ననువు రాదు
(॥పల్లవి॥)
అందరి ముందరనైతే ననువు రాదు
కందువకు నీవు రమ్మా కత చెప్పేను
(॥అంద॥)
చనవు లొకతె కిచ్చి చలము రేఁచే వొకతె
వనితకు వనితలు వట్టపెట్టేరా
ఘనుఁడవు నీకింత గలితే లోనికి రమ్మా
వొనర నీమనసురా నొప్పఁజెప్పేను
(॥అంద॥)
నవ్వే నాపెతో నీకె నమ్మించి దీకొలిపేవు
జవ్వనికి జవ్వని సరిదూఁగదా
అవ్వల నీకింత ప్రియమైతే దగ్గరిరమ్మా
చివ్వన నీవేడుకలు చెల్లించేను
(॥అంద॥)
రతిసేసి చెలియను రమణిఁ బురికొల్పేవు
అతివపై నతివ రా నాస మానీనా
తతి నలమేల్మంగను తగు శ్రీవేంకటాచలా
పతి కూడితివి రమ్మా బాగులు సేసేను
(||pallavi||)
aṁdari muṁdaranaide nanuvu rādu
kaṁduvagu nīvu rammā kada sĕppenu
(||aṁda||)
sanavu lŏgadĕ kichchi salamu rem̐se vŏgadĕ
vanidagu vanidalu vaṭṭabĕṭṭerā
ghanum̐ḍavu nīgiṁta galide lonigi rammā
vŏnara nīmanasurā nŏppam̐jĕppenu
(||aṁda||)
navve nābĕdo nīgĕ nammiṁchi dīgŏlibevu
javvanigi javvani saridūm̐gadā
avvala nīgiṁta priyamaide daggarirammā
sivvana nīveḍugalu sĕlliṁchenu
(||aṁda||)
radisesi sĕliyanu ramaṇim̐ burigŏlbevu
adivabai nadiva rā nāsa mānīnā
tadi nalamelmaṁganu tagu śhrīveṁkaḍāsalā
padi kūḍidivi rammā bāgulu sesenu