అందరి ముందరా నేల ఆడించేవు
(॥పల్లవి॥)
అందరి ముందరా నేల ఆడించేవు
కందువ నీ మేనిపులకలు సాక్షి గాదా
(॥అంద॥)
చెప్పనా అప్పుడే నీచెవిలోన మాటలెల్లాఁ
దప్పక అట్టే నీవు తలఁచరాదా
ముప్పిరినప్పటి నామోమేమి చూచేవు
కుప్పళించే చెమటలే గురుతు గాదా
(॥అంద॥)
వొడఁబరచనా నీవొడి వట్టుకొని నాఁడె
తడఁబడక అవే తలఁచరాదా
నడుమ సెలవులను నవ్వులేమి నవ్వేవు
గుడిగొన్న కరఁగులే గురుతుగాదా
(॥అంద॥)
నేరుపనా రతిఁ గూడి నెలకొన్నకతలెల్ల
తారుకాణగానవి తలఁచరాదా
ఆరయ శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
కోరిన మనచెనకులే గురుతు గాదా
(||pallavi||)
aṁdari muṁdarā nela āḍiṁchevu
kaṁduva nī menibulagalu sākṣhi gādā
(||aṁda||)
sĕppanā appuḍe nīsĕvilona māḍalĕllām̐
dappaga aṭṭe nīvu talam̐sarādā
muppirinappaḍi nāmomemi sūsevu
kuppaḽiṁche sĕmaḍale gurudu gādā
(||aṁda||)
vŏḍam̐barasanā nīvŏḍi vaṭṭugŏni nām̐ḍĕ
taḍam̐baḍaga ave talam̐sarādā
naḍuma sĕlavulanu navvulemi navvevu
guḍigŏnna karam̐gule gurudugādā
(||aṁda||)
nerubanā radim̐ gūḍi nĕlagŏnnagadalĕlla
tārugāṇagānavi talam̐sarādā
āraya śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
korina manasĕnagule gurudu gādā