అందరి మెప్పించుదాఁకా నణఁగేఁగాక । నే
(॥పల్లవి॥)
అందరి మెప్పించుదాఁకా నణఁగేఁగాక । నే-
నిందులోనే పాలు నీరు నేరుపరచలేనా
(॥॥)
ఇంకాఁ దానే యెరిఁగీని ఇప్పుడేలంటాఁగాక
అంకెలం బదరనైతి నయ్యా నేను
వంకలొత్తి నేఁ దనవంటిదాననై తేఁ గన
లంకెలమీతోఁ దనలాగులెల్లఁ జెప్పనా
(॥॥)
ఇప్పటి కోపము మీఁద నిట్టే వుండదని కాక
కప్పుడు నాచేఁతలెల్లఁ గంటే నేను
తప్పని నాగుణములు తనగుణములఁ బోలితే
బొప్పుతో నక్కునఁబోసి చూపనా మీకు
(॥॥)
పోరానిచుట్టరికపు పొందు దనదని కాక
చేరి నోరు మూసుకొంటి చెల్లఁబో నేను
ఆరీతి శ్రీ వేంకటేశుఁ డంతలోనె నన్నుఁ గూడె
తారుకాణ లిఁక నేల తానే నేను
(||pallavi||)
aṁdari mĕppiṁchudām̐kā naṇam̐gem̐gāga | ne-
niṁdulone pālu nīru nerubarasalenā
(||||)
iṁkām̐ dāne yĕrim̐gīni ippuḍelaṁṭām̐gāga
aṁkĕlaṁ badaranaidi nayyā nenu
vaṁkalŏtti nem̐ danavaṁṭidānanai tem̐ gana
laṁkĕlamīdom̐ danalāgulĕllam̐ jĕppanā
(||||)
ippaḍi kobamu mīm̐da niṭṭe vuṁḍadani kāga
kappuḍu nāsem̐talĕllam̐ gaṁṭe nenu
tappani nāguṇamulu tanaguṇamulam̐ bolide
bŏppudo nakkunam̐bosi sūbanā mīgu
(||||)
porānisuṭṭarigabu pŏṁdu danadani kāga
seri noru mūsugŏṁṭi sĕllam̐bo nenu
ārīdi śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalonĕ nannum̐ gūḍĕ
tārugāṇa lim̐ka nela tāne nenu