Amdari kokkade saale aamdlagu mogalagu

అందరి కొక్కటే చాలే ఆండ్లకు మొగలకు
Language

(॥పల్లవి॥)
అందరి కొక్కటే చాలే ఆండ్లకు మొగలకు
ముందటెత్తు వేరె నీతో మోవనాడవలెనా

(॥అంద॥)
వలపుల యీఁది యీఁది వాసులకే లోఁగిలోఁగి
అలుకలే తవ్వితవ్వి యట్టే నవ్వి
చెలఁగేటివిరహివి చింత మాన్ప నెఱఁగవా
చెలి నింతే నీకు నేను చెప్పిచూపవలెనా

(॥అంద॥)
బలిమై చేయి చాఁచిచాఁచి పంతాన మెయిదోఁచితోఁచి
పలుకాఁకఁ గందికంది భామలఁ బొంది
కులుకు జాణఁడవు నాకోర్కి దీర్చనెఱఁగవా
ఇల నే జవ్వని నింతే ఇంతరట్టువలెనా

(॥అంద॥)
పలుకులే చల్లి చల్లి పారిపారి మళ్లీమళ్లీ
వలరాచపనులకే వయ్యాళి వెళ్లి
తలఁచి శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
వెలయు నీదేవి నింతే వేఁడుకొనవలెనా

(||pallavi||)
aṁdari kŏkkaḍe sāle āṁḍlagu mŏgalagu
muṁdaḍĕttu verĕ nīdo movanāḍavalĕnā

(||aṁda||)
valabula yīm̐di yīm̐di vāsulage lom̐gilom̐gi
alugale tavvidavvi yaṭṭe navvi
sĕlam̐geḍivirahivi siṁta mānpa nĕṟam̐gavā
sĕli niṁte nīgu nenu sĕppisūbavalĕnā

(||aṁda||)
balimai seyi sām̐sisām̐si paṁtāna mĕyidom̐sidom̐si
palugām̐kam̐ gaṁdigaṁdi bhāmalam̐ bŏṁdi
kulugu jāṇam̐ḍavu nāgorgi dīrsanĕṟam̐gavā
ila ne javvani niṁte iṁtaraṭṭuvalĕnā

(||aṁda||)
palugule salli salli pāribāri maḽlīmaḽlī
valarāsabanulage vayyāḽi vĕḽli
talam̐si śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
vĕlayu nīdevi niṁte vem̐ḍugŏnavalĕnā