Amdanunna selulage anniyunum jellunu

అండనున్న చెలులకే అన్నియునుఁ జెల్లును
Language

(॥పల్లవి॥)
అండనున్న చెలులకే అన్నియునుఁ జెల్లును
దండియైన మొగమోటే తగు మా యిద్దరికి

(॥అండ॥)
మెచ్చితిఁబో నిన్నును మెలుతురొ నీవాతని
మచ్చము మోవనాడినమాటలకును
తుచ్చము మోకాడ రాదు తుద సమ్మతించరాదు
పచ్చిగా నాతఁడిందుకు పతి యాడరాదు

(॥అండ॥)
మేలు మేలె దిట్టవౌదు మిక్కిలి నాతనిమీఁద
వేళెరిఁగి వాఁటినింద వేసినందుకు
తాలిమి మాకుఁ దగదు తమకించను దగదు
వాలాయించి ఆతనికి వాదడువఁ దగదు

(॥అండ॥)
నీవంటిజాణ యేదే నేఁ డతని సిగ్గుదేర
చేవదేరి రతికిఁ దెచ్చిన యందుకు
వోపల శ్రీవేంకటేశుఁ డొక్కటాయ నాతో నాతఁ
డేవిధాననైన నింక నెదుగాడఁ జెల్లదు

(||pallavi||)
aṁḍanunna sĕlulage anniyunum̐ jĕllunu
daṁḍiyaina mŏgamoḍe tagu mā yiddarigi

(||aṁḍa||)
mĕchchidim̐bo ninnunu mĕludurŏ nīvādani
machchamu movanāḍinamāḍalagunu
tuchchamu mogāḍa rādu tuda sammadiṁcharādu
pachchigā nādam̐ḍiṁdugu padi yāḍarādu

(||aṁḍa||)
melu melĕ diṭṭavaudu mikkili nādanimīm̐da
veḽĕrim̐gi vām̐ṭiniṁda vesinaṁdugu
tālimi māgum̐ dagadu tamagiṁchanu dagadu
vālāyiṁchi ādanigi vādaḍuvam̐ dagadu

(||aṁḍa||)
nīvaṁṭijāṇa yede nem̐ ḍadani siggudera
sevaderi radigim̐ dĕchchina yaṁdugu
vobala śhrīveṁkaḍeśhum̐ ḍŏkkaḍāya nādo nādam̐
ḍevidhānanaina niṁka nĕdugāḍam̐ jĕlladu