Amdanumdevaaramu addamu neramu

అండనుండేవారము అడ్డము నేరము
Language

(॥పల్లవి॥)
అండనుండేవారము అడ్డము నేరము
నిండుకొని మీకు మీకే నెలవుకోరయ్యా

(॥అండ॥)
చెలినీలో మాటలు సిగ్గులలో తేటలు
చలివాయ వింటిమి మాసాకి రేలయ్యా
వలపులు వడ్డివారీ వాదు లెక్కడిమి మీకు
చలిమి బలిమి మీరే సంతము గారయ్యా

(॥అండ॥)
మగువనీనవ్వులు మరునంపపువ్వులు
తగవు దేర్చితిమి మంతన మేలయ్యా
చిగిరించె తమకము చింత లెక్కడివి మీరు
మొగములు చూచి మీరే మొక్కులాడరయ్యా

(॥అండ॥)
వనితనీచూపులు వడిఁ దరితీపులు
మనసురాఁ జేసితిమి మఱి యేలయ్యా
అనుగుశ్రీవేంకటేశ అలమేల్మంగయు నీవు
యెనసితి రిఁకను మీ కిచ్చలాడేమయ్యా

(||pallavi||)
aṁḍanuṁḍevāramu aḍḍamu neramu
niṁḍugŏni mīgu mīge nĕlavugorayyā

(||aṁḍa||)
sĕlinīlo māḍalu siggulalo teḍalu
salivāya viṁṭimi māsāgi relayyā
valabulu vaḍḍivārī vādu lĕkkaḍimi mīgu
salimi balimi mīre saṁtamu gārayyā

(||aṁḍa||)
maguvanīnavvulu marunaṁpabuvvulu
tagavu dersidimi maṁtana melayyā
sigiriṁchĕ tamagamu siṁta lĕkkaḍivi mīru
mŏgamulu sūsi mīre mŏkkulāḍarayyā

(||aṁḍa||)
vanidanīsūbulu vaḍim̐ daridībulu
manasurām̐ jesidimi maṟi yelayyā
anuguśhrīveṁkaḍeśha alamelmaṁgayu nīvu
yĕnasidi rim̐kanu mī kichchalāḍemayyā