అండనుండవే నా మారు; ఆతనికి నాకుఁ బోదు
(॥పల్లవి॥)
అండనుండవే నా మారు; ఆతనికి నాకుఁ బోదు
దండిగా నాపై దయను తనే వచ్చీఁగాని
(॥అండ॥)
మనసులో నాబత్తి మఱవకుమనఁగదే
వనితలు పెక్కు గలవాడు తాను
అనిశము నాకానికె అందుకొమ్మనఁగదవే
ఘనమైనసంపదలు గలవాఁడు తను
(॥అండ॥)
తగిలిన నాసేవ తలఁచుకొమ్మనఁగదే
మగటిమితో పొత్తులమగఁడు తాను
సొగిసి నాలేకలు చూచుకొమ్మనఁగదే
అగపడిఅట్టే లోలుఁడై వుండుఁ దాను
(॥అండ॥)
సోఁకిననాగోరితాఁకు చూచుకొమ్మనఁగదే
వాఁకపురతిసాములవాఁడు తాను
యేఁకటశ్రీవేంకటేశుఁ డిట్టె తా నన్నుఁ గూడె
పోఁకవెట్టి పెండ్లాడినపురుషుఁడే తాను
(||pallavi||)
aṁḍanuṁḍave nā māru; ādanigi nāgum̐ bodu
daṁḍigā nābai dayanu tane vachchīm̐gāni
(||aṁḍa||)
manasulo nābatti maṟavagumanam̐gade
vanidalu pĕkku galavāḍu tānu
aniśhamu nāgānigĕ aṁdugŏmmanam̐gadave
ghanamainasaṁpadalu galavām̐ḍu tanu
(||aṁḍa||)
tagilina nāseva talam̐sugŏmmanam̐gade
magaḍimido pŏttulamagam̐ḍu tānu
sŏgisi nālegalu sūsugŏmmanam̐gade
agabaḍiaṭṭe lolum̐ḍai vuṁḍum̐ dānu
(||aṁḍa||)
som̐kinanāgoridām̐ku sūsugŏmmanam̐gade
vām̐kaburadisāmulavām̐ḍu tānu
yem̐kaḍaśhrīveṁkaḍeśhum̐ ḍiṭṭĕ tā nannum̐ gūḍĕ
pom̐kavĕṭṭi pĕṁḍlāḍinaburuṣhum̐ḍe tānu