Amdane nilusumti ne nappudugaadaa

అండనే నిలుచుంటి నే నప్పుడుగాదా
Language

(॥పల్లవి॥)
అండనే నిలుచుంటి నే నప్పుడుగాదా
మెండుకొన్న ఆనలేల మేలు మేలు గాదా

(॥అండ॥)
తొయ్యలి యెవ్వతో నీతొడమీఁదఁ బవళించి
అయ్యెడ నీకు మోవిచ్చె నప్పుడు గాదా
నెయ్యాన నాకుమడిచి నీ వందిఇయ్యఁగాను
పయ్యదకొం గప్పుడు నీపైఁ గప్పెఁ గాదా

(॥అండ॥)
చెక్కు చెమరించఁగా నీచే సురటి విసరించి
అక్కరతో సేదదేరె నప్పుడు గాదా
వొక్కటై నీ నెన్నడుము వొక్కచేతఁ గాఁగిలించి
మొక్కె నప్పు డొక్కచేత ముచ్చటాడికాదా

(॥అండ॥)
దిట్టయై తమకమునఁ దేలించి నిన్నుఁ జూచి
అట్టె తెరవేయించె నప్పుడు గాదా
నెట్టిన శ్రీవేంకటేశ నీవు నట్లానే
పట్టి నేఁడు గూడితి వాభావమేకాదా

(||pallavi||)
aṁḍane nilusuṁṭi ne nappuḍugādā
mĕṁḍugŏnna ānalela melu melu gādā

(||aṁḍa||)
tŏyyali yĕvvado nīdŏḍamīm̐dam̐ bavaḽiṁchi
ayyĕḍa nīgu movichchĕ nappuḍu gādā
nĕyyāna nāgumaḍisi nī vaṁdiiyyam̐gānu
payyadagŏṁ gappuḍu nībaim̐ gappĕm̐ gādā

(||aṁḍa||)
sĕkku sĕmariṁcham̐gā nīse suraḍi visariṁchi
akkarado sedaderĕ nappuḍu gādā
vŏkkaḍai nī nĕnnaḍumu vŏkkasedam̐ gām̐giliṁchi
mŏkkĕ nappu ḍŏkkaseda muchchaḍāḍigādā

(||aṁḍa||)
diṭṭayai tamagamunam̐ deliṁchi ninnum̐ jūsi
aṭṭĕ tĕraveyiṁchĕ nappuḍu gādā
nĕṭṭina śhrīveṁkaḍeśha nīvu naṭlāne
paṭṭi nem̐ḍu gūḍidi vābhāvamegādā