అండఁ గూచుండెను చెలి యంత చాలదా
(॥పల్లవి॥)
అండఁ గూచుండెను చెలి యంత చాలదా
నిండు నీతో జూజమాడ నేఁడే నేరుచునా
(॥॥)
పగడవాతెర యెత్తి పలికెను చాలదా!నీవు
మగువను మంతనాన మాటాడియ్యఁగా
తగినకన్యక ఇంతేఁ తమకించనేల
ఇగిరించె సిగ్గులు నేఁ డీప్పుడే తేరునా
(॥॥)
తలుపుమాటున నుండి తమిఁ జూచెఁ జాలదా నీవు
పిలిచి చేయివట్టి పెనఁగఁగను
చలివాయ నిప్పు డిట్టె సరసము లేల
వొలసి రట్టడితన మొక్కమాఁటే వచ్చునా
(॥॥)
కాఁగిలించఁగా నీతోఁ గరఁగెను చాలదా నీవు
మాఁగినమోవి ఇచ్చి మచ్చు చల్లఁగా
పాఁగిన శ్రీ వేంకటేశ పడఁతిఁ గూడితివి
ఆఁగి నీతో రతిసేయ కప్పుడే పోనిచ్చునా
(||pallavi||)
aṁḍam̐ gūsuṁḍĕnu sĕli yaṁta sāladā
niṁḍu nīdo jūjamāḍa nem̐ḍe nerusunā
(||||)
pagaḍavādĕra yĕtti paligĕnu sāladā!nīvu
maguvanu maṁtanāna māḍāḍiyyam̐gā
taginaganyaga iṁtem̐ tamagiṁchanela
igiriṁchĕ siggulu nem̐ ḍīppuḍe terunā
(||||)
talubumāḍuna nuṁḍi tamim̐ jūsĕm̐ jāladā nīvu
pilisi seyivaṭṭi pĕnam̐gam̐ganu
salivāya nippu ḍiṭṭĕ sarasamu lela
vŏlasi raṭṭaḍidana mŏkkamām̐ṭe vachchunā
(||||)
kām̐giliṁcham̐gā nīdom̐ garam̐gĕnu sāladā nīvu
mām̐ginamovi ichchi machchu sallam̐gā
pām̐gina śhrī veṁkaḍeśha paḍam̐tim̐ gūḍidivi
ām̐gi nīdo radiseya kappuḍe ponichchunā