అందాఁకాఁ గాఁగిన నిన్ను నన రాదు గా
(॥పల్లవి॥)
అందాఁకాఁ గాఁగిన నిన్ను నన రాదు గా
పొందిక లైన మీఁద బుద్ది చెప్పేఁ గాని
(॥అందాకా॥)
వేడుక నీ రమణుఁడు విచ్చేసుదాఁకా నీ
వాడిన ట్టెల్లా మాకు నాడ వలెఁ గా
యీడుగా సమరితి మి మ్మిద్దరిఁ గూడఁగఁ జేసి
జోడుగా నీతిట్లకు సూడు వట్టెఁ గాని
(॥అందాకా॥)
పక్కన మీలోన మొకబంగారు వాసినదాఁకా
వెక్కసపు నీసణఁగు వినవలెగా
చిక్కు వడ్డ మీలోని చిత్తము లేకము సేసి
దక్కిన నీచేఁత లెల్లాఁ దగఁ దిప్పేఁ గాని
(॥అందాకా॥)
యీకడ నాతఁడు నిన్ను యిట్టె మన్నించినదాఁకా
నాకు నాకే నిన్నుఁ జూచి నవ్వవలెఁ గా
చేకొని యింతలోనె యాశ్రీవెంకటేశుఁడు గూడె
సాకిరి దెలిపి మీద సమ్మతించేఁ గాని
(||pallavi||)
aṁdām̐kām̐ gām̐gina ninnu nana rādu gā
pŏṁdiga laina mīm̐da buddi sĕppem̐ gāni
(||aṁdāgā||)
veḍuga nī ramaṇum̐ḍu vichchesudām̐kā nī
vāḍina ṭṭĕllā māgu nāḍa valĕm̐ gā
yīḍugā samaridi mi mmiddarim̐ gūḍam̐gam̐ jesi
joḍugā nīdiṭlagu sūḍu vaṭṭĕm̐ gāni
(||aṁdāgā||)
pakkana mīlona mŏgabaṁgāru vāsinadām̐kā
vĕkkasabu nīsaṇam̐gu vinavalĕgā
sikku vaḍḍa mīloni sittamu legamu sesi
dakkina nīsem̐ta lĕllām̐ dagam̐ dippem̐ gāni
(||aṁdāgā||)
yīgaḍa nādam̐ḍu ninnu yiṭṭĕ manniṁchinadām̐kā
nāgu nāge ninnum̐ jūsi navvavalĕm̐ gā
segŏni yiṁtalonĕ yāśhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍĕ
sāgiri dĕlibi mīda sammadiṁchem̐ gāni