Amdaamkaam dadavagure aadani meeru

అందాఁకాఁ దడవకురే ఆతని మీరు
Language

(॥పల్లవి॥)
అందాఁకాఁ దడవకురే ఆతని మీరు
విందు వెట్టి అలుకలు విడిపించేఁ గాక

(॥అందాఁ॥)
అంతేసిపంతగాని కాడినదే మాటగాక
యెంత మీరు పిలిచినా నేల వచ్చీనే
బంతులనే పూవుటమ్ము బాసట మెక్కినపుడు
దొంతులతోనే తా నిందుకు వచ్చీఁగాక

(॥అందాఁ॥)
చెల్లు బడిగలవాఁడు చేసినదే చేఁతగాక
యెల్లవారు బోదించినా నేల వినీనే
యెల్లగా నాయాడుఁదన మీడేరినప్పుడే
వెల్లవిరివిన్న పాలు వినుకొనీఁ గాక

(॥అందాఁ॥)
ఇంచ్చకుఁడైనవాని కిన్నియుఁ దెలుఁ గాక
యెచ్చరించి మావుదాఁకా నేమి సేసేరే
అచ్చపు శ్రీ వేంకటేశుఁ డంత సేసి నన్నుఁ గూడె
మచ్చిక గలదు నేఁడే మన్నీంచీఁ గాక

(||pallavi||)
aṁdām̐kām̐ daḍavagure ādani mīru
viṁdu vĕṭṭi alugalu viḍibiṁchem̐ gāga

(||aṁdām̐||)
aṁtesibaṁtagāni kāḍinade māḍagāga
yĕṁta mīru pilisinā nela vachchīne
baṁtulane pūvuḍammu bāsaḍa mĕkkinabuḍu
dŏṁtuladone tā niṁdugu vachchīm̐gāga

(||aṁdām̐||)
sĕllu baḍigalavām̐ḍu sesinade sem̐tagāga
yĕllavāru bodiṁchinā nela vinīne
yĕllagā nāyāḍum̐dana mīḍerinappuḍe
vĕllavirivinna pālu vinugŏnīm̐ gāga

(||aṁdām̐||)
iṁchchagum̐ḍainavāni kinniyum̐ dĕlum̐ gāga
yĕchchariṁchi māvudām̐kā nemi sesere
achchabu śhrī veṁkaḍeśhum̐ ḍaṁta sesi nannum̐ gūḍĕ
machchiga galadu nem̐ḍe mannīṁchīm̐ gāga