అందాఁకా నీ వేమన్నా నన్నీ నౌఁగాదనఁ గాని
(॥పల్లవి॥)
అందాఁకా నీ వేమన్నా నన్నీ నౌఁగాదనఁ గాని
యెందునుఁ బోనప్పుడుగా యెనసేది మనసు
(॥అందాఁ॥)
అక్కడిపరాకు మానినప్పుడుగా నీవు
గక్కన నాకాఁగిటిలోఁ గరఁగేది
నిక్కి చూడక నావద్ద నిలిచినప్పుడుగా
చిక్కి నాకుఁజెప్పినట్లు సేసేది నీవు
(॥అందాఁ॥)
వింత చెలులసుద్దులు వినిన(నని) యప్పుడుగా
మంతనాన నీవు నాతో మాటలాడేది
సంతల నీసన్నలు నీ చాయలు నుడిగితేఁగా
అంతట నాతో సరసమాడేది నీవు
(॥అందాఁ॥)
మగువలభ్రమలెల్ల మఱచినప్పుడుగా
నగితే నీవు నాతో నవ్వేది
అగడై శ్రీవేంకటేశ అంతసేసి నిన్నాఁగఁగ
తగ నన్నుఁ గూడితివి తప్పకిదె నీవూ
(||pallavi||)
aṁdām̐kā nī vemannā nannī naum̐gādanam̐ gāni
yĕṁdunum̐ bonappuḍugā yĕnasedi manasu
(||aṁdām̐||)
akkaḍibarāgu māninappuḍugā nīvu
gakkana nāgām̐giḍilom̐ garam̐gedi
nikki sūḍaga nāvadda nilisinappuḍugā
sikki nāgum̐jĕppinaṭlu sesedi nīvu
(||aṁdām̐||)
viṁta sĕlulasuddulu vinina(nani) yappuḍugā
maṁtanāna nīvu nādo māḍalāḍedi
saṁtala nīsannalu nī sāyalu nuḍigidem̐gā
aṁtaḍa nādo sarasamāḍedi nīvu
(||aṁdām̐||)
maguvalabhramalĕlla maṟasinappuḍugā
nagide nīvu nādo navvedi
agaḍai śhrīveṁkaḍeśha aṁtasesi ninnām̐gam̐ga
taga nannum̐ gūḍidivi tappagidĕ nīvū