Amdaamka nee raba mavumgaadananu

అందాఁక నీ రప మవుఁగాదనను
Language

(॥పల్లవి॥)
అందాఁక నీ రప మవుఁగాదనను
కందువ వేళనే కైకొనేఁ గాక

(॥అందాఁ॥)
వలచినదాన వద్దనఁ గలనా
చెలఁగి నీ వేమి సేసినను
మొలక చన్నులు మోపేటి వేళనే
చలము లన్నియు సాదించేఁ గాక

(॥అందాఁ॥)
కోరుకొన్నదాన కోపగింతునా
మేరలు నీ వెంత మీరినను
సారపుఁ గెమ్మోవి చవిగొనే వేళ
బీరములన్నియు పెనచేఁగాక

(॥అందాఁ॥)
కూడి నట్టి దాన గుట్టు దాఁచేనా
యీడనే శ్రీ వేంకటేశ నిన్ను
మేడెపురతులమీఁద నున్న వేళ
పాడి పంతములఁ బంగించేఁ గాక

(||pallavi||)
aṁdām̐ka nī raba mavum̐gādananu
kaṁduva veḽane kaigŏnem̐ gāga

(||aṁdām̐||)
valasinadāna vaddanam̐ galanā
sĕlam̐gi nī vemi sesinanu
mŏlaga sannulu mobeḍi veḽane
salamu lanniyu sādiṁchem̐ gāga

(||aṁdām̐||)
korugŏnnadāna kobagiṁtunā
meralu nī vĕṁta mīrinanu
sārabum̐ gĕmmovi savigŏne veḽa
bīramulanniyu pĕnasem̐gāga

(||aṁdām̐||)
kūḍi naṭṭi dāna guṭṭu dām̐senā
yīḍane śhrī veṁkaḍeśha ninnu
meḍĕburadulamīm̐da nunna veḽa
pāḍi paṁtamulam̐ baṁgiṁchem̐ gāga