అందాలు సేసుకోలేవు అయ్యో నీవు
(॥పల్లవి॥)
అందాలు సేసుకోలేవు అయ్యో నీవు
యిందుముఖి నీసంది యెరవులు గలవా
(॥అందా॥)
వలసనిజోలబెట్టి వాదు లడిచీఁగాక
అలిగెనా యింతినీతో అప్పటనుండి
చెలరేఁగి మోహమున చిమ్ముచుఁ దిట్టీఁగాక
బలిమిసేయఁగ నీతో పగటా సతికి
(॥అందా॥)
తనియనియాసతోడ తప్పకచూచీఁగాక
గునిసి నిన్నాపె నేఁడు కోపగించెనా
మనసుతమకమున మరియూఁ బెనఁగీఁగాక
కినియ నీతో నేమి కేరడమా చెలికి
(॥అందా॥)
కరగినమతితోడ కాఁగిలించుకొనీఁగాక
గరువము చూపెనా కాంత నీతోను
అరయ శ్రవేంకటేశ అలమేలుమంగ నిన్ను
యిరవుగఁ గూడెఁగాక యెమ్మెలాయీలేమకు
(||pallavi||)
aṁdālu sesugolevu ayyo nīvu
yiṁdumukhi nīsaṁdi yĕravulu galavā
(||aṁdā||)
valasanijolabĕṭṭi vādu laḍisīm̐gāga
aligĕnā yiṁtinīdo appaḍanuṁḍi
sĕlarem̐gi mohamuna simmusum̐ diṭṭīm̐gāga
balimiseyam̐ga nīdo pagaḍā sadigi
(||aṁdā||)
taniyaniyāsadoḍa tappagasūsīm̐gāga
gunisi ninnābĕ nem̐ḍu kobagiṁchĕnā
manasudamagamuna mariyūm̐ bĕnam̐gīm̐gāga
kiniya nīdo nemi keraḍamā sĕligi
(||aṁdā||)
karaginamadidoḍa kām̐giliṁchugŏnīm̐gāga
garuvamu sūbĕnā kāṁta nīdonu
araya śhraveṁkaḍeśha alamelumaṁga ninnu
yiravugam̐ gūḍĕm̐gāga yĕmmĕlāyīlemagu