Amdaalu sesuga neevoo naagedo navvuda gaaga

అందాలు సేసుక నీవూ నాకెతో నవ్వుత గాక
Language

(॥పల్లవి॥)
అందాలు సేసుక నీవూ నాకెతో నవ్వుత గాక
అందరి ముందరా నీకూ నాన లింతేశాలయ్యా

(॥అందా॥)
పాలసివుండి వొచ్చినాపె పలుకు నేమైనా నిన్ను
బాసలెన్ని సేసి వొడఁ బరచేవయ్యా
వాసిగలయాపె మాఁట వట్టి తప్పులెంచఁజూచు
తాసువలెఁ జూచి యెంత తారుకాణించేవయ్యా

(॥అందా॥)
వలచివచ్చినయాపె వలసినట్టు చేసు
సొలసి యెంత నీ వొడ్డించేకొనేవయ్యా
బలిమి గలిగినాపె పైకొని నీతోఁ బెనఁగు
చలమున బొమ్మలను జంకించనేలయ్యా

(॥అందా॥)
బత్తిగల యాపె గుబ్బల నొత్తి కాఁగిలించు
కొత్త సిగ్గులతో నేమి గుంపించేవయ్యా
ఇత్తల శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
చిత్తగించి కూడితివి చెనకఁగ నేలయ్యా

(||pallavi||)
aṁdālu sesuga nīvū nāgĕdo navvuda gāga
aṁdari muṁdarā nīgū nāna liṁteśhālayyā

(||aṁdā||)
pālasivuṁḍi vŏchchinābĕ palugu nemainā ninnu
bāsalĕnni sesi vŏḍam̐ barasevayyā
vāsigalayābĕ mām̐ṭa vaṭṭi tappulĕṁcham̐jūsu
tāsuvalĕm̐ jūsi yĕṁta tārugāṇiṁchevayyā

(||aṁdā||)
valasivachchinayābĕ valasinaṭṭu sesu
sŏlasi yĕṁta nī vŏḍḍiṁchegŏnevayyā
balimi galiginābĕ paigŏni nīdom̐ bĕnam̐gu
salamuna bŏmmalanu jaṁkiṁchanelayyā

(||aṁdā||)
battigala yābĕ gubbala nŏtti kām̐giliṁchu
kŏtta siggulado nemi guṁpiṁchevayyā
ittala śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
sittagiṁchi kūḍidivi sĕnagam̐ga nelayyā