అంచెల నీతోఁ బెనఁగి యలసితిని
(॥పల్లవి॥)
అంచెల నీతోఁ బెనఁగి యలసితిని
చంచలము లెల్లఁ బాపి చనవీయవయ్యా
(॥అంచె॥)
వీడెను నాతురుము వెనకదిక్కుననుండి
వీడెము చేతఁ బట్టుక వెంటఁ బారఁగా
వేడుకఁ గాఁగిలించితి వేగమే నిన్నంతలోన
యీడ నాపంతము చెల్లె నింటికి రావయ్యా
(॥అంచె॥)
చెదరెఁ గస్తూరిబొట్టు చెమట నుదుట నిండి
వెదకి పువ్వుల నిన్ను వేయఁగాను
పదరి నే నదెల్లా నీపచ్చడానఁ దుడిచితి
కొదువ లిన్నియుఁబాసెఁ గూచుండవయ్యా
(॥అంచె॥)
నిండె నామైఁ బులకలు నిన్నుఁ గరఁగించేనంటా
నండ నే నొక్కొక మాటలాడఁగాను
దండిగా శ్రీవేంకటేశ తగ నిన్నుఁ గూడితి
కొండగొంటి నిఁక నాకుఁ గొప్పువెట్టవయ్యా
(||pallavi||)
aṁchĕla nīdom̐ bĕnam̐gi yalasidini
saṁchalamu lĕllam̐ bābi sanavīyavayyā
(||aṁchĕ||)
vīḍĕnu nādurumu vĕnagadikkunanuṁḍi
vīḍĕmu sedam̐ baṭṭuga vĕṁṭam̐ bāram̐gā
veḍugam̐ gām̐giliṁchidi vegame ninnaṁtalona
yīḍa nābaṁtamu sĕllĕ niṁṭigi rāvayyā
(||aṁchĕ||)
sĕdarĕm̐ gastūribŏṭṭu sĕmaḍa nuduḍa niṁḍi
vĕdagi puvvula ninnu veyam̐gānu
padari ne nadĕllā nībachchaḍānam̐ duḍisidi
kŏduva linniyum̐bāsĕm̐ gūsuṁḍavayyā
(||aṁchĕ||)
niṁḍĕ nāmaim̐ bulagalu ninnum̐ garam̐giṁchenaṁṭā
naṁḍa ne nŏkkŏga māḍalāḍam̐gānu
daṁḍigā śhrīveṁkaḍeśha taga ninnum̐ gūḍidi
kŏṁḍagŏṁṭi nim̐ka nāgum̐ gŏppuvĕṭṭavayyā